Featured

భారీగా తగ్గిన బంగారం ధర.. కొనేందుకు సరైన సమయమిదే..?

సంక్రాంతి పండుగ రావడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. పండుగకు ముందు బంగారం ధర భారీగా పతనమైంది. ఏకంగా రికార్డ్ స్థాయిలో బంగారం ధర 2,000 రూపాయలు తగ్గింది. ఎంసీఎక్స్ లో బంగారం ధర ఏకంగా 2,086 రూపాయలు తగ్గి 48,818 రూపాయలకు చేరడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న పరిస్థితుల వల్లే బంగారం ధర క్షీణించినట్లు తెలుస్తోంది. బంగారం కొనుగోలు చేసేవాళ్లకు ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఏడాది పెళ్లిళ్లు ప్లాన్ చేసుకున్న వాళ్లు బంగారం ఇప్పుడు కొనుగోలు చేస్తే మంచిది. వేర్వేరు కారణాల వల్ల బంగారం ధర తగ్గుతుండగా భవిష్యత్తులో బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1,833 డాలర్లుగా ఉంది. మన దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 51,800 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 47,500 రూపాయలుగా ఉంది.

ఒకవైపు బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండటంతో వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. వెండి ధర ఏకంగా కిలోకు 6,1000 రూపాయల వరకు తగ్గాయి. దీంతో ప్రస్తుతం వెండి ధర 63,650 రూపాయలుగా ఉంది. ప్రాంతాలను బట్టి బంగారం, వెండి ధరలలో స్వల్పంగా మార్పులు ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన ప్రజలకు అందుబాటులోకి రావడం బంగారం ధరలు తగ్గడానికి కారణమవుతోంది.

ఒకటిమికి మించి కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ డ్రైరన్ జరుగుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగుతుందని కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago