RAMOT HASHEVIM, ISRAEL - MARCH 14: Freshly-laid eggs are collected for delivery to the local packing plant at the Aronheim family's egg farm on March 14, 2008 in the farming community of Ramot Hashevim, central Israel. World food prices are soaring in the face of what some analysts are describing as a perfect storm of circumstances; increasing demand from developing economies in Asia, rising fuel prices, severe weather impacting recent harvests and an economic shift to biofuel production. All this leaves the consumer paying more for basic staples such as bread and milk and is likely to have its hardest impact on poorer nations. (Photo by David Silverman/Getty Images)
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పక్షులు, వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రాథమికంగా బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు, పక్షులు చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ భయం వల్ల చాలామంది గుడ్లు, చికెన్ అంటే టెన్షన్ పడుతున్నారు. గుడ్లు, చికెన్ తింటే మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉందని ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇలాంటి సమయంలో గుడ్లు, చికెన్ తినవచ్చా..? తినకూడదా..? అనే సందేహం చాలామందిని వెంటాడుతోంది. గడిచిన వారం రోజుల నుంచి గుడ్లు, చికెన్ వినియోగం తగ్గడంతో వీటి ధరలు కూడా భారీగా తగ్గాయి. డబ్ల్యూహెచ్‌వో తాజాగా గుడ్లు, చికెన్ తినడం వల్ల ఎటువంటి నష్టం లేదని.. బాగా వేడి చేసిన గుడ్లు, చికెన్ తింటే బర్డ్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉండదని.. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని సూచించింది.
అయితే బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను దగ్గరకు తీసుకున్నా, ఉడికీ ఉడకని బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తిన్నా మనుషులు కూడా బర్డ్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. వైరస్ ప్రమాదం లేని రాష్ట్రాల్లో ప్రజలు ఆందోళన చెందకుండా గుడ్లు, చికెన్ తినవచ్చని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. కనీసం 70 డిగ్రీల దగ్గర గుడ్లు, చికెన్ ఉండించడం ద్వారా వైరస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరోవైపు నిపుణులు మాంసాన్ని శుభ్రంగా కడగడంతో పాటు చేతులను కూడా శుభ్రంగా కడగాలని సూచిస్తున్నారు. సగం ఉడికించిన మాంసం, హాఫ్ బాయిల్డ్ తినకూడదని చెబుతున్నారు. మరోవైపు వేగంగా వ్యాప్తి చెందుతున్న బర్డ్ ఫ్లూ ఫౌల్ట్రీ పరిశ్రమ భారీ నష్టాలకు కారణమవుతున్నట్టు తెలుస్తోంది.
హిమాలయ పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయంలో భక్తుల కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను…
జీవితంలో అదృష్టం కలిసిరావడం లేదనే భావన, ఆర్థిక ఒత్తిడులు, పనుల్లో ఆలస్యం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ…
ఆహార పదార్థాల్లో కనిపించే కొన్ని సహజ పదార్థాలు ఒకేలా కనిపించినా, వాటి గుణాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అలాంటి…
ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…
ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…