Tag Archives: ardharatri

పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి ఇతరుల సినిమాల్లో నటించకపోడానికి కారణం ఏమిటో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పీపుల్స్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్.నారాయణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “నేరము -శిక్ష” సినిమా ద్వారా జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సంగీత ఈ సినిమాతో హీరోగా మారారు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న ఆర్ నారాయణ మూర్తి ఆ తర్వాత దర్శకుడిగా మారారు.

ఈ క్రమంలోనే నారాయణమూర్తి దర్శకత్వంలో ఆయన నటుడిగా నటిస్తూ తెరకెక్కిన చిత్రం “అర్ధరాత్రి స్వతంత్రం”. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలను నిజ జీవితానికి ఆధారంగా సామాజిక అంశాలతో, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించే వారు. ఈ విధంగా నారాయణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఎర్రసైన్యం, భూపోరాటం, అడవి దివిటీలు, చీమలదండు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు పొందాయి.

ఇలా సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు మంచి నటుడిగా దర్శకుడిగా కొనసాగిన ఆర్.నారాయణమూర్తి సినిమాలకు ప్రస్తుతం పెద్దగా ఆదరణ దక్కలేదని చెప్పవచ్చు. ఈయన సినిమాలకు ఆదరణ లేకున్నప్పటికీ ఇతనికి పలు దర్శకుల సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. కొందరి దర్శకులు వారి సినిమాలలో నారాయణమూర్తికి ప్రత్యేక పాత్రలో నటించమని అవకాశం కల్పించినప్పటికీ నారాయణమూర్తి దర్శకులకు ఎంతో సున్నితంగా సినిమాలలో నటించినని చెప్పేశారు.

నారాయణ మూర్తి కేవలం తన సినిమాలలో మాత్రమే నటించేవారు. ఇతర దర్శకులు సినిమాలలో మంచి అవకాశాలు వస్తున్నా నటించక పోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఇతర దర్శకుల సినిమాల్లో నాకు అవకాశం వచ్చినప్పుడు నా మనసుకు నచ్చకుండా నటించడం వల్ల ఎక్కువ సార్లు టేకులు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా చాలాసార్లు టేకులు తీసుకున్నప్పుడు నామీద నాకే అసహ్యం కలుగుతుంది.

నాతో సినిమా తీయాలంటే “ఒమర్ ముఖ్తార్” వంటి సినిమా అయిన తీయాలి లేకపోతే శంకరాభరణం సినిమాలో జె.వి.సోమయాజులు వంటి పాత్ర అయినా ఇవ్వాలి అంతే కానీ మిగతా ఏ పాత్రలో నటించడానికి కూడా తన మనసు ఒప్పుకోదని అందుకోసమే తాను తన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల్లో తప్ప ఇతర దర్శకుల సినిమాల్లో నటించనని ఓ సందర్భంలో ఆర్. నారాయణమూర్తి తెలియజేశారు.