Tag Archives: bad breath

Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి .. అద్భుతమైన చిట్కాలు ఇవే!

Health Tips: ఈ మధ్యకాలంలో అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్యలలో నోటికి సంబంధించిన సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి. దంతాల నొప్పి,నోటి దుర్వాసన వంటి సమస్యలు అధికంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటి పరిష్కారానికి డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కొంతమందికి ఎటువంటి ఫలితం లేకుండా పోతోంది. వేలకు వేలు ఖర్చు చేసి డాక్టర్ని సంప్రదించటం కంటే మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాల ద్వారా నోటి దుర్వాసన సమస్య చెక్ పెట్టవచ్చు. ఆ పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి .. అద్భుతమైన చిట్కాలు ఇవే!

సాధారణంగా మనిషి రోజుకు ఏడు నుండి ఎనిమిది లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. కానీ అతి తక్కువ మంది సరైన మోతాదులో నీటిని తీసుకుంటున్నారు. నీటిని తక్కువగా తీసుకునే వారిలో నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నోటి దుర్వాసన సమస్య తో బాధపడేవారు నీటిలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగటం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగిపోయి నోటి దుర్వాసన సమస్య నుండి విముక్తి లభిస్తుంది.

Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి .. అద్భుతమైన చిట్కాలు ఇవే!

మనం ఇంట్లో లవంగాలు ఖచ్చితంగా ఉంటాయి. లవంగాల ని వంటలలో రుచికోసం వినియోగిస్తూ ఉంటారు. ఇది ఆహారాన్ని రుచిగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. లవంగాలను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. నోట్లో లవంగాలను వేసుకొని నమలటం వల్ల వాటిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోటి లోపల ఉన్న బ్యాక్టీరియాను తొలగించి నోటి దుర్వాసన నుండి విముక్తి కలిగిస్తాయి.

రక్తస్రావం సమస్యలు తగ్గుతాయి…

తేనేలోఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారు దాల్చిన చెక్క పొడి చేసి అందులో కొంచెం తేనె కలిపి ఆ మిశ్రమాన్ని నోటిలో రాసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇలా చేయటం వల్ల పంటి నొప్పి, చిగుళ్ళ నుండి రక్తస్రావం వంటి సమస్యలు కూడా అరికట్టవచ్చు.

నోటి దుర్వాసనకు జాజికాయ తో చెక్ పెట్టండి ఇలా..!

ఈ మధ్యకాలంలో నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల చాలా మందికి పళ్ళు పసుపు రంగులోకి మారుతుంటాయి.అలాంటివారు పళ్ళు తెల్లగా అవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరికొంతమందికి నోరు ఎల్లప్పుడూ దుర్వాసన వస్తుంటుంది. అలాంటి వారు నలుగురిలో మాట్లాడటానికి మొహమాట పడుతూ ఉంటారు.అయితే ఈ నోటి దుర్వాసన సమస్య పోగొట్టడానికి జాజికాయ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంతే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కోసం ఆయుర్వేదంలో ఈ జాజికాయను విరివిగా ఉపయోగిస్తుంటారు.అయితే జాజికాయను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

పళ్ళు పసుపు పచ్చగా ఉండి నోరు దుర్వాసన వచ్చేవారు తాంబూలంలో జాజికాయను తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన సమస్య తొలగిపోతుంది. అదేవిధంగా పళ్ళ మీద ఏర్పడిన పసుపుపచ్చని గార కూడా తొలగిపోతుంది. ప్రతిరోజు గ్లాసు గోరువెచ్చని పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయి. కొద్ది పరిమాణంలో జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగడం వల్ల చర్మ కాంతి మెరుగు పడటమే కాకుండా, చర్మంపై ముడతలను సైతం నివారిస్తుంది.

నిత్యం ఈ జాజికాయను తీసుకోవటంవల్ల దాహాన్ని తగ్గించడంతో పాటు, జలుబు, దగ్గు, కఫం వంటి వాటికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.జాజికాయలో లభించే ‘మిరిస్టిసిన్’ అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. జాజికాయ పొడిని మిశ్రమంలా తయారు చేసుకొని మొహానికి స్క్రబ్ మాదిరిగా వాడటం వల్ల చర్మకాంతి రెట్టింపవుతుంది. అయితే ఈ జాజికాయను తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాజికాయను ఉపయోగించకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.