Tag Archives: bajaj housing finance limited

కస్టమర్లకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే బజాజ్ ఫైనాన్స్ రుణాలు..?

కరోనా విజృంభణ నేపథ్యంలో మారిన ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కస్టమర్లకు వరుస శుభవార్తలు చెబుతున్నాయి. రుణాలపై వడ్డీరేట్లను భారీగా తగ్గిస్తూ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ కూడా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. బజాజ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రుణాలపై భారీగా వడ్డీరేట్లను తగ్గించింది.

సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 6.9 శాతం నుంచే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రుణాలు ప్రారంభం కానున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై వడ్డీరేట్లను భారీగా తగ్గించడం గమనార్హం. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్ పై 6.9 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా ఎస్బీఐకు పోటీగా ఇంతే వడ్డీకి బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తుండటం గమనార్హం.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో ఒక వ్యక్తి ఇంటి కొనుగోలు కోసం కోటి రూపాయలు లోన్ తీసుకుంటే 6.9 శాతం వడ్డీ ప్రకారం చాలా తక్కువ మొత్తం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే బజాజ్ ఫైనాన్స్ లో వడ్డీ రేట్లు తగ్గడం వల్ల హోం లోన్ తీసుకున్న వాళ్లకు లక్షల రూపాయలు ఆదా కానుందని తెలుస్తోంది. కోటి రూపాయల లోన్ కు 30 సంవత్సరాలను లోన్ టెన్యూర్ గా ఎంచుకుంటే లోన్ పూర్తయ్యే సమయానికి కోటీ 30 లక్షలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

అయితే సాధారణంగా బయట వడ్డీలతో పోలిస్తే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ వడ్డీరేటుకే రుణాలు పొందే అవకాశం ఉండటంతో పాటు లోన్ చెల్లించడానికి ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవచ్చు.