Tag Archives: Bench video conference

అమ్మాయిలు నచ్చిన వారితో ఉండవచ్చు.. డిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..?

దేశంలో చాలా సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పుల గురించి దేశ ప్రజల మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు సైతం ప్రత్యేకంగానే ఉంటాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఒక ప్రత్యేకమైన కేసులో ప్రత్యేకమైన తీర్పును ఇచ్చింది. మేజర్ అయిన అయిన నచ్చిన చోట నచ్చిన వారితో ఉండవచ్చని కోర్టు వెల్లడించింది. జస్టిసెస్ విపిన్ సంఘీ, రజ్నీష్ భట్‌నగర్‌ లతో కూడిన బెంచ్ నిన్న ఈ తీర్పును వెలువరించింది.

కోర్టు తీర్పు చెప్పిన కేసు వివరాల్లోకి వెళితే 20 సంవత్సరాల యువతి ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె సోదరుడు ఆమె కిడ్నాప్ కు గురైందని కేసు ఫైల్ చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై బబ్లూ అనే యువకుడిని ప్రేమించిన సులేఖ తనకు ఇష్టమైతే బబ్లూలోతే ఉండవచ్చని కోర్టు వెల్లడించింది.

తల్లిదండ్రులు కూతురిని తమ వద్దే ఉండాలని ఇబ్బంది పెట్టకూడదని యువతి సోదరుడికి కోర్టు సూచనలు చేసింది. యువతికి సమీపంలోని పోలీస్ స్టేషన్ బీట్ కానిస్టేబుల్ నంబర్ ను ఇచ్చి అవసరమైతే కానిస్టేబుల్ ను సంప్రదించాలని కోర్టు సూచనలు చేసింది. సెప్టెంబర్ 12న సులేఖ ఇంటి నుంచి వెళ్లీపోగా ఆమె సోదరుడు ప్రవీణ్ కిడ్నాప్ కేసు ఫైల్ చేశాడు.

సులేఖ కోర్టుకు హాజరై తాను బబ్లూనే పెళ్లి చేసుకుంటానని చెప్పడం గమనార్హం. ఇద్దరు వ్యక్తులు కావాలనుకుంటే కలిసి ఉండొచ్చని చట్టాలు చెబుతున్న తీర్పుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.