దేశంలో చాలా సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పుల గురించి దేశ ప్రజల మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు సైతం ప్రత్యేకంగానే ఉంటాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఒక ప్రత్యేకమైన కేసులో ప్రత్యేకమైన తీర్పును ఇచ్చింది. మేజర్ అయిన అయిన నచ్చిన చోట నచ్చిన వారితో ఉండవచ్చని కోర్టు వెల్లడించింది. జస్టిసెస్ విపిన్ సంఘీ, రజ్నీష్ భట్‌నగర్ లతో కూడిన బెంచ్ నిన్న ఈ తీర్పును వెలువరించింది.
కోర్టు తీర్పు చెప్పిన కేసు వివరాల్లోకి వెళితే 20 సంవత్సరాల యువతి ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె సోదరుడు ఆమె కిడ్నాప్ కు గురైందని కేసు ఫైల్ చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బెంచ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై బబ్లూ అనే యువకుడిని ప్రేమించిన సులేఖ తనకు ఇష్టమైతే బబ్లూలోతే ఉండవచ్చని కోర్టు వెల్లడించింది.
తల్లిదండ్రులు కూతురిని తమ వద్దే ఉండాలని ఇబ్బంది పెట్టకూడదని యువతి సోదరుడికి కోర్టు సూచనలు చేసింది. యువతికి సమీపంలోని పోలీస్ స్టేషన్ బీట్ కానిస్టేబుల్ నంబర్ ను ఇచ్చి అవసరమైతే కానిస్టేబుల్ ను సంప్రదించాలని కోర్టు సూచనలు చేసింది. సెప్టెంబర్ 12న సులేఖ ఇంటి నుంచి వెళ్లీపోగా ఆమె సోదరుడు ప్రవీణ్ కిడ్నాప్ కేసు ఫైల్ చేశాడు.
సులేఖ కోర్టుకు హాజరై తాను బబ్లూనే పెళ్లి చేసుకుంటానని చెప్పడం గమనార్హం. ఇద్దరు వ్యక్తులు కావాలనుకుంటే కలిసి ఉండొచ్చని చట్టాలు చెబుతున్న తీర్పుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…