Tag Archives: Bhaag Sale movie

Rajeev Kanakala: సుమను లేపుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నాను… ఆ అవకాశం ఇవ్వలేదు: రాజీవ్ కనకాల

Rajeev Kanakala: రాజీవ్ కనకాల ఇండస్ట్రీలో నటుడిగా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన స్టార్ హీరోలు అందరి సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తున్నట్టుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ఈయన సతీమణి యాంకర్ సుమ కనకాల గురించి చెప్పాల్సిన పనిలేదు.

గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతూ హీరోయిన్లకు మించి ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడమే కాకుండా అదే స్థాయిలో సంపాదిస్తున్నారని కూడా చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో ఇద్దరు ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి. ఇకపోతే తాజాగా రాజీవ్ కనకాల నటించిన బాగ్ సాలె అనే సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

Rajeev Kanakala: పెళ్లికి సుమ పేరెంట్స్ ఒప్పుకోలేదు….


ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజీవ్ కనకాల సుమ గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. తాను సుమను ప్రేమించానని అయితే సుమతో తన పెళ్లికి తన కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో తనని లేపుకెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నానని తెలిపారు. అయితే తన పేరెంట్స్ నాకు అవకాశం ఇవ్వలేదని తరువాత మా పెళ్ళికి ఒప్పుకొని పెళ్లి చేశారు అంటూ ఈ సందర్భంగా రాజీవ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.