Tag Archives: Biryani leaf

బిర్యానీ ఆకులతో టీ తయారు చేసుకోండి.. ఈ ప్రయోజనాలను పొందండి!

బిర్యానీ ఆకులను సాధారణంగా మనం బిర్యానీ చేసే సమయంలో మాత్రమే వాడుతాం. వెజ్ బిర్యానీ అయినా.. నాన్ వెజ్ బిర్యానీ అయినా బిర్యానీ ఆకు వేస్తే ఆ రుచే రెట్టింపు అవుతుంది. చివరకు మసాలా కూరల్లోనూ ఈ ఆకు వేస్తే ఆ టేస్టే వేరప్పా అన్నట్లు ఫుడ్ లవర్స్ ఎంజాయ్ చేస్తూ ఓ పట్టుపట్టేస్తారు. టేస్ట్ లోనే కాదు.. ఆరోగ్యానికి ఈ బిర్యానీ లీఫ్ ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటితో టీ కూడా చేసుకోవచ్చు.

బిర్యానీ ఆకుల అన్ని లక్షణాలను ఈ టీ గ్రహిస్తుంది. ఎలా చేయాలో తెలుసుకుందాం. బిర్యానీ ఆకుల టీ రుచికరంగా ఉండటంతో పాటు మంచి వాసన కలిగి ఉంటుంది. దీనికి ముఖ్యంగా 2-3 కప్పుల నీరు, 4-5 బిర్యానీ ఆకులు కావాలి. తాజా బిర్యానీ ఆకులు ఉంటే మీరు 3-4 బే ఆకులను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి కూడా దొరక్కపోతే ఎండిన బిర్యానీ ఆకులను కూడా ఉపయోగించవచ్చు.
ముందుగా ఒక పాత్రలో నీళ్లు వేసి మరిగించాలి.

కాస్త మరిగాక బిర్యానీ ఆకులను వేసి మరో రెండు నిమిషాలు తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఎంతో ఈజీగా తయారుచేసుకునే ఈ టీ ఎంతో రుచిగా ఉంటుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్‌తో సహా ఎలాంటి నొప్పినైనా తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం బిరియానీ ఆకులు క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

కిడ్నీలో రాళ్లను కరిగించడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఈ బిరియానీ ఆకులు బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సహాయపడతాయి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారు ఈ టీ తాగడం వల్ల గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి.. మధుమేహ వ్యాధిని నయం చేస్తుంది.