Tag Archives: Black Fungus Treatment

బ్లాక్ ఫంగస్ నుంచి మీ కళ్లను ఇలా కాపాడుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!

దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది బ్లాక్ ఫంగస్ బారినపడి కంటిచూపును మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. బ్లాక్ ఫంగస్ ముందుగా కంటి పై దాడి చేసే కంటిచూపును కోల్పోయేలా చేస్తుంది. అయితే బ్లాక్ ఫంగస్ ప్రతి ఒక్కరిలోనూ వ్యాపించి ప్రమాదానికి గురి చేయదు.

ఎవరి శరీరంలో అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఎవరైతే బలహీనంగా ఉండి మధుమేహం, అవయవ దానం, మూత్రపిండ సమస్యలు వంటి వాటితో బాధపడే వారిలో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది.అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నప్పుడు బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండవచ్చు.ఈ క్రమంలోనే మన శరీరంలో అధిక మొత్తం రోగనిరోధక శక్తి ఉండాలి. రోగ నిరోధక శక్తి పెరగాలంటే తప్పకుండా పోషక పదార్థాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

చేపలు: చేపలలో ఎక్కువభాగం విటమిన్లు పోషక పదార్థాలతో కూడి ఉంటుంది. అందువల్ల చేపలను,ముఖ్యంగా సముద్ర చేపలను తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.

గుడ్లు: గుడ్లు పోషకాల నిలయం అని చెప్పవచ్చు.ల్యుటెయిన్, జీజాంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు గుడ్లలో ఉంటాయి. రోజూ ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవడం వల్ల మన శరీరానికి అధిక మొత్తంలో రోగనిరోధక శక్తిని పొందవచ్చు.

నట్స్: బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా వంటి వాటిలో అధిక మొత్తం ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఈ విధమైనటువంటి వాటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

తాజా కూరగాయలు, ఆకుకూరలు: తాజా కూరలు, కాయగూరలలో ఎక్కువ భాగం విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఇవి మన శరీరానికి కావల్సినంత రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. ఈ విధమైన ఆహార పదార్థాలు మాత్రమే కాకుండా అధిక భాగం ధాన్యాలు, పప్పు దినుసులు, తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

సిట్రస్ జాతి పండ్లు: మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంచడంలో సిట్రస్ జాతి పండ్లు ఎంతగానో దోహదపడ్డాయి.ఈ పండ్లలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వారికే వస్తుందట.. జాగ్రత్త వహించండి..!!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ గురించి తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, బ్లాక్ ఫంగస్ అంటూ మరొక వ్యాధి ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ బ్లాక్ ఫంగస్ వివిధ రాష్ట్రాలలో నమోదయ్యి తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి మహారాష్ట్రలో 90 మంది మరణించారు. బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కరోనా బారినపడి కరోనా నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా కరోనా బారినపడి కోలుకున్న మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రత అధికంగా ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. మ్యుకర్‌మైకోసెస్ అనే బ్లాక్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ లేదా ఊపిరితిత్తులని ఎఫెక్ట్ చేస్తుంది. అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్టర్, స్కిన్ మరియు ఇతర ఆర్గాన్ సిస్టమ్ కూడా ఈ ఫంగస్ బారిన పడే అవకాశం ఉంది.

బ్లాక్ ఫంగస్ వ్యాపించిన వారిలో ఎక్కువగా ముక్కు నుంచి రక్తం, నల్లటి ద్రావణం కారుతుంది. అదే విధంగా కన్ను, బుగ్గలపై వాపును కలిగిస్తుంది. ఈ క్రమంలోనే నోరు తెరవడానికి కష్టంగా ఉండటం, కన్ను సరిగా కనిపించక పోవడం వంటివి జరుగుతాయి.ఈ బ్లాక్ ఫంగస్ మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు వ్యాపిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మధుమేహంతో బాధపడే వారు కరోనా బారిన పడి కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారి శరీరంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయిలో లేకుండా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి బ్లాక్ వ్యాపిస్తుందని, అందుకోసమే కరోనా నుంచి కోలుకున్న తర్వాత పదే పదే మన బ్లడ్ షుగర్ లెవల్స్ ను పరీక్షించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా బారిన పడిన వారిలో ఎక్కువగా స్టెరాయిడ్, యాంటీ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల ఈ విధమైనటువంటి బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని, మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదిస్తూ వారి సూచనల మేరకే మందులు ప్రయోగించాలని అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఆర్గాన్ ట్రాన్ ప్లాంట్ చేసి ఉంటారో అలాంటి వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని, వారిలో కూడా బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.