ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ గురించి తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, బ్లాక్ ఫంగస్ అంటూ మరొక వ్యాధి ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ బ్లాక్ ఫంగస్ వివిధ రాష్ట్రాలలో నమోదయ్యి తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి మహారాష్ట్రలో 90 మంది మరణించారు. బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కరోనా బారినపడి కరోనా నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా కరోనా బారినపడి కోలుకున్న మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రత అధికంగా ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. మ్యుకర్‌మైకోసెస్ అనే బ్లాక్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ లేదా ఊపిరితిత్తులని ఎఫెక్ట్ చేస్తుంది. అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్టర్, స్కిన్ మరియు ఇతర ఆర్గాన్ సిస్టమ్ కూడా ఈ ఫంగస్ బారిన పడే అవకాశం ఉంది.
బ్లాక్ ఫంగస్ వ్యాపించిన వారిలో ఎక్కువగా ముక్కు నుంచి రక్తం, నల్లటి ద్రావణం కారుతుంది. అదే విధంగా కన్ను, బుగ్గలపై వాపును కలిగిస్తుంది. ఈ క్రమంలోనే నోరు తెరవడానికి కష్టంగా ఉండటం, కన్ను సరిగా కనిపించక పోవడం వంటివి జరుగుతాయి.ఈ బ్లాక్ ఫంగస్ మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు వ్యాపిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
మధుమేహంతో బాధపడే వారు కరోనా బారిన పడి కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారి శరీరంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయిలో లేకుండా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి బ్లాక్ వ్యాపిస్తుందని, అందుకోసమే కరోనా నుంచి కోలుకున్న తర్వాత పదే పదే మన బ్లడ్ షుగర్ లెవల్స్ ను పరీక్షించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా బారిన పడిన వారిలో ఎక్కువగా స్టెరాయిడ్, యాంటీ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల ఈ విధమైనటువంటి బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని, మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదిస్తూ వారి సూచనల మేరకే మందులు ప్రయోగించాలని అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఆర్గాన్ ట్రాన్ ప్లాంట్ చేసి ఉంటారో అలాంటి వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని, వారిలో కూడా బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…