ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఛార్మి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుతం సినిమాలకు స్వస్తి చెప్పిన ఈమె నిర్మాతగా మారారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న” లైగర్” సినిమాకు నిర్మాతగా మారిన ఛార్మి గత కొంతకాలం నుంచి పూరి ముంబైలోనే నివసిస్తున్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాయని భావించి విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా తరహాలో లైగర్ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న లైగర్ సినిమా పై కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో ఈ సినిమా షూటింగును ఆపివేశారు. ఈ క్రమంలోనే ఛార్మి ముంబైలోనే నివసిస్తున్నారు. మరి పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ముంబై వెళ్ళినప్పుడు చార్మి, పూరిను కలిశారు. ఆ క్రమంలో చార్మి షేర్ చేసిన ఓ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
సింహం అంటూ తన పెట్, ప్రభాస్ ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఫోటోలో ఛార్మి పెట్ డాగ్ ను చూసి నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలస్కన్ మలమూటే అంటూ తన తొమ్మిది నెలల కొడుకు అంటూ అందరికీ పరిచయం చేసేశారు. అంత ఎత్తున కుక్కను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఛార్మి తనకెంతో ఇష్టమైన తన పెంపుడు జంతువుతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా ఛార్మీ ఓ పోస్ట్ చేసింది. సైలెంట్‌గా ఉండండి.. మీ కుక్కను హగ్ చేసుకోండి.. అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. తన పెట్ డాగ్ పై కాలేసుకుని సోఫా మీద పడుకున్న ఫోటోను షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఛార్మి పెళ్లి చేసుకోబోతోందని, వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ విధంగా తన పై వచ్చిన వార్తలకు స్పందించిన ఛార్మి పెళ్లి చేసుకుని జీవితంలో పెద్ద తప్పు చేయనని తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…