Tag Archives: black rice

ఈ బియ్యం కిలో రూ.300.. డిమాండ్ ఎక్కువ.. ప్రయోజనాలు అధికం!

ప్రస్తుతం మార్కెట్లో మనకు వివిధ రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న రకం నల్లబియ్యం.ప్రస్తుతం మార్కెట్లో ఈ నల్ల బియ్యానికి బాగా డిమాండ్ పెరిగింది. 2 సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లాలో అర ఎకరాలో సాగు చేసిన ఈ బియ్యం తాజాగా 20 ఎకరాలలో సాగు చేస్తున్నారు.ఈ విధమైనటువంటి నల్ల బియ్యాన్ని క్రిమిసంహారక మందులతో కాకుండా పూర్తిగా జీవ ఎరువులతో తయారు చేయటం వల్ల ఈ బియ్యానికి అధిక డిమాండ్ ఏర్పడింది.

సాధారణ వరి రకం ఎకరానికి 25–30 బస్తాల దిగుబడి వస్తే ఈ నల్లబియ్యం మాత్రం ఎకరాకు 10–15 బస్తాలు మాత్రమే వస్తుంది. బ్లాక్ రైస్ ను రైతులు కిలో 170 నుంచి 180 వరకు విక్రయించగా మార్కెట్లో మాత్రం కిలో ధర ఏకంగా 300 నుంచి 350 వరకు ధర పలుకుతోంది.ఈ విధంగా ఈ బియ్యానికి అధిక డిమాండ్ ఏర్పడటానికి కారణం ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉండటమే.

నల్ల బియ్యంలో అత్యధికంగా ఆంకోసైనిన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లుగా ఉంటాయి. ఇవి నిరోధక ఎంజైములను క్రియాశీలకం చేసి మధుమేహం, గుండెజబ్బులు వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కల్పిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలకపాత్ర పోషిస్తాయి.విటమిన్‌–బి, ఇ, నియాసిన్,క్యాల్షియం మెగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి కనుక ఈ బియ్యానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడింది.

నల్ల బియ్యాన్ని కేవలం జీవ ఎరువులతో తయారు చేయటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావించడం వల్లే ఈ బియ్యానికి మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఎంతో డిమాండ్ ఉన్న ఈ పంటను ఎక్కువ సాగు చేయడానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు.అందుకు గల కారణం ఇవి చాలా ఎత్తు పెరగటం వల్ల చిన్నపాటి గాలి వీచిన పంట మొత్తం నాశనం అవుతుంది.

రైతులకు లక్షాధికారులను చేస్తున్న బియ్యం ఇవే.. కిలో ఎంతంటే..?

సాధారణంగా కిలో బియ్యం ఎంత అనే ప్రశ్నకు ఎవరైన 30 రూపాయల నుంచి 50 రూపాయల ఖరీదు చేస్తుందని చెబుతారు. అయితే కృష్ణ బియ్యం మాత్రం ఏకంగా కిలో 300 రూపాయల నుంచి 400 రూపాయలు పలుకుతుంది. ఈ బియ్యాన్ని పండించిన రైతులు కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో కృష్ణ బియ్యం బలవర్ధక ఆహారంగా పేరు తెచ్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బియ్యం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అనేక రైతు కుటుంబాలు కృష్ణ బియ్యం పండించడం ద్వారా సంపన్న కుటుంబాలుగా మారాయని మోదీ అన్నారు. వారణాసి పర్యటనలో భాగంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన అత్యాధునిక మౌలిక వసతుల వల్ల రైతులు కృష్ణబియ్యం పండించగలుగుతున్నారని మోదీ అన్నారు. చంద్రోలి రైతుల గురించి మాట్లాడుతూ కృష్ణబియ్యంలో ఒక రకాన్ని చంద్రోలి రైతులు పండించారని అన్నారు.

కృష్ణబియ్యం పండించిన రైతుల కొరకు ప్రత్యేక సమితిని ఏర్పాటు చేయడంతో పాటు మార్కెట్ కూడా సిద్ధం చేశామని అన్నారు. విదేశీ మార్కెట్ లో సైతం కృష్ణవ్రీహీ బియ్యంకు మంచి డిమాండ్ ఉంటుందని ఆస్ట్రేలియాకు కిలో 850 రూపాయల చొప్పున ఈ బియాన్ని ఎగుమతి చేస్తున్నామని మోదీ అన్నారు. ఈ బియ్యం ప్రాచీన వరి వంగడమని మోదీ అన్నారు. కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ సుశృత సంహితలో కృష్ణ వ్రీహీ బియ్యం గురించి ప్రస్తావించారని అన్నారు.

కృష్ణ బియ్యం అతి ప్రాచీన రకాల్లో ఒకటని ఈ బియ్యం పండించిన రైతులు చెబుతున్నారు. యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఈ బియ్యాన్ని ప్రాచీన కాలంలో ఎక్కువగా వినియోగించేవారని రైతులు చెబుతున్నారు. కృష్ణ బియ్యం జీవోత్పత్తి వ్యవస్థను పెంపొందించటంలో సహాయపడతాయి.