Tag Archives: bride

వరుడు నల్ల అద్దాలు ధరించాడని పెళ్లి ఆపిన వధువు.. కారణం ఏమిటంటే?

మన జీవితంలో జరిగే ముఖ్యమైన వేడుకలలో వివాహ వేడుక ఒకటి. ఈ వివాహ వేడుకలో బంధువులు, అతిథులు, స్నేహితులు పాల్గొని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ విధంగానే అతిధుల సమక్షంలో ఎంతో ఘనంగా జరుగుతున్న వివాహం ఉన్నపళంగా ఆగిపోయింది. అసలు పెళ్లి ఆగడానికి కారణం కేవలం వరుడు పెళ్లి పీటలపై నల్ల అద్దాలు ధరించి కూర్చోవటం వల్లనే వధువు ఈ పెళ్ళికి నిరాకరించి పెళ్ళిని ఆపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్లోని మహారాజ్ పూర్ గ్రామానికి చెందిన వినోద్ కుమాత్‌తో . జమాలిపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూతురితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే పెళ్లిరోజు బంధువులందరూ ఎంతో ఉత్సాహంగా సంగీత కార్యక్రమంలో సందడి చేస్తు డాన్సులు వేస్తున్నారు. మరికాసేపట్లో పెళ్లి జరగబోతుంది అన్న నేపథ్యంలో వధువు ఈ పెళ్లిని ఆపింది. వరుడు పెళ్లి పీటల పైకి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని రావడంతో వధువు కుటుంబ సభ్యులకు అతడిపై అనుమానం కలిగింది.

ఈ క్రమంలోనే వధువు అతనికి ఓ పరీక్ష పెట్టింది. అద్దాలు తొలగించి అతడిని న్యూస్ పేపర్ చదవమని చెప్పడంతో వరుడు తెల్ల ముఖం పెట్టాడు. తనకు కళ్లు సరిగా కనిపించవని తేలడంతో వధువు ఈ పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పింది.ఇరు కుటుంబాల మధ్య రెండు రోజులపాటు పంచాయతీ చేసినప్పటికీ వధువు ఈ పెళ్లికి నిరాకరించడంతో ఈ పెళ్లి ఆగిపోయింది.

ఈ విధంగా తమ కొడుకుకి చూపు లేదనే విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి తమను మోసం చేశారంటూ వధువు తండ్రి వరుడు, అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లిలో వధువు కాళ్లు మొక్కిన వరుడు.. ఎందుకంటే?

సాధారణంగా పెళ్లి వేడుక అంటే ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి ఇంటినిండా చుట్టాలు, పిల్లలు చేసే అల్లరి, పసందైన వంటకాలు ఇవన్నీ ఉంటేనే ఇన్ని రోజుల వరకు పెళ్లి అనే మాటకు అర్థం ఉండేది. కానీ గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి వ్యాపించడంతో పెళ్లి అనే మాటకు అర్థం మారిపోయింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, చడీ చప్పుడు కాకుండా, పెళ్లి జరుగుతున్న విషయం నాలుగో కంటికి తెలియకుండా పెళ్లిళ్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎన్నో జంటలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఒక్కటయ్యాయి.పెళ్లి తంతు కార్యక్రమం జరిగేటప్పుడు ఎన్నో పూజా కార్యక్రమాల అనంతరం వధువు చేత వరుడు పాదాలకు నమస్కారం చేయడం మనం చూస్తుంటాము. ఈ విధంగా ఎన్నో సంస్కృతి ఆచార వ్యవహారాలను పాటిస్తూ పెళ్లి వేడుక కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఈ క్రమంలోనే తాజాగా ఓ పెళ్లి వేడుకలో పెళ్ళి తంతు ముగిసిన తర్వాత ఓ వింత ఘటన చోటు చేసుకుంది.

పెళ్లి తంతు కార్యక్రమం ముగిసిన తర్వాత ఇరువురు దండలు మార్చుకున్న తరువాత వరుడు ఉన్నఫలంగా వధువు కాళ్ళపై పడి నమస్కారం చేశాడు. ఒక్కసారిగా వరుడు చేసిన ఈ పనికి పెళ్లికి వచ్చిన అతిథులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే వరుడు మాట్లాడుతూ తన ఇంటిని తన వారిని వదులుకొని నా కోసం తన సంతోషం కోసం నా ఇంట అడుగుపెడుతూ, నా వంశాన్ని అభివృద్ధి చేయడం కోసం వస్తున్న ఆమె పాదాలకు నమస్కారం చేయడంలో తప్పేముందనీ ప్రశ్నించాడు.

ప్రస్తుతం ఈ విధంగా వరుడు వధువు కాళ్ళకి నమస్కరిస్తున్నటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకర్షించింది. ఈ విధంగా తన జీవిత భాగస్వామి పట్ల ఎంతో అద్భుతంగా ఆలోచించిన వరుడు పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పెళ్లికూతురుకు ఆ అలవాటు ఉండకూడదట.. పెళ్లి ప్రకటన వైరల్…?

ఈ మధ్య కాలంలో మనుషుల ఆలోచనా తీరు మారుతోంది. పెళ్లి విషయంలో నచ్చిన అబ్బాయే కావాలని అమ్మాయిలు, నచ్చిన అమ్మాయే కావాలని అబ్బాయిలు మొండిగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చిన లక్షణాలు ఉన్న వధువు/వరుడు దొరకకపోతే మ్యాట్రిమొనీల ద్వారా, పెళ్లి ప్రకటనల ద్వారా వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వింత పెళ్లి ప్రకటన వైరల్ అవుతోంది.

పశ్చిమ బెంగాల్‌ లోని కమన్పూర్ కు చెందిన న్యాయవాది చటర్జీ పేపర్ లో తనకు సోషల్ మీడియాకు అడిక్ట్ కాని అమ్మాయి కావాలని, ఆ అమ్మాయి అందంగా పొడవుగా ఉండాలని ప్రకటన ఇచ్చాడు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ యువతీయువకుల జీవితంలో భాగమైపోయాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సందేశాల ద్వారా మాత్రమే సమాచారం అవతలి వ్యక్తులకు చేరుతోంది. సోషల్ మీడియా యాప్స్ కు యువతీయువకులు బానిసలవుతున్నారు.

ఈ కాలంలో సోషల్ మీడియా యాప్స్ వినియోగించని వధువు లేదా వరుడు కావాలని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. చటర్జీ ‌ అనే 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్న న్యాయవాది, పరిశోధకుడు పేపర్ లో ఈ ప్రకటన ఇచ్చాడు. అతనికి ఇళ్లు, కార్లు అనీ ఉన్నాయి. అయితే అతని మనస్సులో ఏముందో తెలియదు కానీ ఇలాంటి వింత ప్రకటనను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతనికి జన్మలో పెళ్లి కాదని కామెంట్లు పెడుతున్నారు.

అయితే వృత్తిపరంగా ఎన్నో కేసులను చూడటం వల్లే చటర్జీ అలాంటి అభిప్రాయానికి వచ్చి ఉంటాడని మరి కొందరు భావిస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం భార్యకు కనీసం సోషల్ మీడియా యాప్స్ వినియోగించే స్వేచ్ఛ కూడా ఇవ్వరా..? అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హెచ్.ఐ.వీ పాజిటివ్ ఉన్న మహిళకు ఒక కులానికి చెందిన వరుడు కావాలనే ప్రకటన వైరల్ కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి ప్రకటన హల్చల్ చేస్తోంది.