మన జీవితంలో జరిగే ముఖ్యమైన వేడుకలలో వివాహ వేడుక ఒకటి. ఈ వివాహ వేడుకలో బంధువులు, అతిథులు, స్నేహితులు పాల్గొని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ విధంగానే అతిధుల సమక్షంలో ఎంతో ఘనంగా జరుగుతున్న వివాహం ఉన్నపళంగా ఆగిపోయింది. అసలు పెళ్లి ఆగడానికి కారణం కేవలం వరుడు పెళ్లి పీటలపై నల్ల అద్దాలు ధరించి కూర్చోవటం వల్లనే వధువు ఈ పెళ్ళికి నిరాకరించి పెళ్ళిని ఆపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్లోని మహారాజ్ పూర్ గ్రామానికి చెందిన వినోద్ కుమాత్‌తో . జమాలిపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూతురితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే పెళ్లిరోజు బంధువులందరూ ఎంతో ఉత్సాహంగా సంగీత కార్యక్రమంలో సందడి చేస్తు డాన్సులు వేస్తున్నారు. మరికాసేపట్లో పెళ్లి జరగబోతుంది అన్న నేపథ్యంలో వధువు ఈ పెళ్లిని ఆపింది. వరుడు పెళ్లి పీటల పైకి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని రావడంతో వధువు కుటుంబ సభ్యులకు అతడిపై అనుమానం కలిగింది.
ఈ క్రమంలోనే వధువు అతనికి ఓ పరీక్ష పెట్టింది. అద్దాలు తొలగించి అతడిని న్యూస్ పేపర్ చదవమని చెప్పడంతో వరుడు తెల్ల ముఖం పెట్టాడు. తనకు కళ్లు సరిగా కనిపించవని తేలడంతో వధువు ఈ పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పింది.ఇరు కుటుంబాల మధ్య రెండు రోజులపాటు పంచాయతీ చేసినప్పటికీ వధువు ఈ పెళ్లికి నిరాకరించడంతో ఈ పెళ్లి ఆగిపోయింది.
ఈ విధంగా తమ కొడుకుకి చూపు లేదనే విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి తమను మోసం చేశారంటూ వధువు తండ్రి వరుడు, అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…