Tag Archives: business

రూ.లక్ష పెట్టుబడితో నెలకు రూ.40,000 ఆదాయం.. ఏం బిజినెస్ అంటే..?

మనలో చాలామందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఏ బిజినెస్ చేయాలి..? తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఎలా డబ్బు సంపాదించాలి..? అనే విషయాలపై అవగాహన ఉండదు. అయితే కొన్ని బిజినెస్ ల ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఈ సీజన్ ఆ సీజన్ అనే తేడాల్లేకుండా బిస్కెట్లకు అన్ని సీజన్లలోనూ డిమాండ్ ఉంటుంది. రుచికరమైన బిస్కెట్లను తయారు చేస్తే చాలు లాభాలు ఖచ్చితంగా వస్తాయి.

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ బిస్కెట్లను ఇష్టపడతారు. బిస్కెట్ల తయారీ బిజినెస్ లో నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ బిజినెస్ కు పెట్టుబడి లేకపోతే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ల ద్వారా సులభంగా రుణం పొందే అవకాశం కూడా ఉంటుంది. ముద్రా స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలు చేసేవాళ్ల కోసం తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తోంది. దాదాపు 5 లక్షల రూపాయలు ఈ బిజినెస్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ 5 లక్షలలో మూడు నుంచి 4 లక్షల రూపాయలు బిస్కెట్లను తయారు చేసే మెషీన్ల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. 90 శాతం వర్కింగ్ క్యాపిటల్ లోన్ బ్యాంక్ నుంచి లభిస్తుంది కాబట్టి లక్ష రూపాయలు సొంతంగా పెట్టుబడి పెడితే సులువుగా బిస్కెట్ల తయారీ ప్లాంట్ ను ప్రారంభించవచ్చు. మెషిన్ల కొనుగోలు పోగా మిగిలిన మొత్తాన్ని ముడి పదార్థాలు, ప్యాకేజీ, పని చేసే వాళ్ల వేతనం కోసం ఖర్చు చేయాలి.

బిస్కెట్ తయారీ ప్లాంట్ వ్యాపారం ద్వారా అన్ని ఖర్చులు పోనూ నెలకు 40,000 రూపాయలు ఖచ్చితంగా మిగులుతుంది. సంవత్సరానికి 5 లక్షల రూపాయలకు అటూఇటుగా ఆదాయం చేకూరుతుంది.