Tag Archives: carona vaccine

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది మృతి.. ఎక్కడంటే..?


భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 500 లోపే కొత్త కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా నేటి నుంచి వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒకటికి మించి కరోనా వ్యాక్సిన్లు సక్సెస్ కావడంతో వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ వేగంగా జరగనుందని తెలుస్తోంది.

అయితే కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వార్త వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే వారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. నార్వేలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి చెందారు. మరీ బలహీనంగా ఉన్న వృద్ధులు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాదమని ప్రాథమికంగా తెలుస్తోంది. మృతి చెందిన 23 మంది ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారని సమాచారం.

ఆరోగ్యంగా లేని వృద్ధులు కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే ప్రమాదం పొంచి ఉందని ఈ ఘటన ద్వారా నిరుపితమవుతోంది. నార్వే ఆరోగ్య శాఖ జీవితకాలం తక్కువగా ఉన్నవారు వ్యాక్సిన్ కు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఫైజ‌ర్‌, బ‌యోఎన్‌టెక్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు మృతి చెందడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

నార్వేలో మొత్తం 33,000 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోగా వారిలో 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా కనిపించినట్లు తెలుస్తోంది. అయితే నార్వే ప్రభుత్వం యువకులు, ఆరోగ్యవంతులు ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ ను తీసుకోవచ్చని చెబుతున్నారు.