Tag Archives: cauliflower

ఈ సమస్యలతో బాధపడేవారు కాలిఫ్లవర్ ను దూరం పెట్టాల్సిందే..!

ఆకుకూరలు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. కొద్దిమంది ఉదయమే పచ్చి కూరగాయలను ఆకుకూరలను తింటూ ఉంటారు. కూరగాయలలో మరియు ఆకుకూరలలో మన శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇలా ఒక్కొక్క ఒక సీజన్లో ఒక్కొక్క రకమైన కూరగాయలు లభిస్తాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఎక్కువగా తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు మరియు ఎన్ని నష్టాలు తెలుసుకుందాం.

క్యాలీఫ్లవర్ లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కాలీఫ్లవర్ తినక పోవటం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సలహా
ఇస్తున్నారు.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ ను ఎక్కువగా తినటం వల్ల దానిలో ఉండే క్యాల్షియం వల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూడా కాలిఫ్లవర్ ఎక్కువగా తినకూడదు.

మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు కూడా క్యాలీఫ్లవర్ తినకూడదు. క్యాలీఫ్లవర్ లో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల యూరిన్ సమస్యలు ఏర్పడి మూత్రపిండాలకు సమస్య ఇంకా పెరుగుతుంది.కిడ్నీ సమస్యలతో బాధపడేవారు థైరాయిడ్ వంటి సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ కు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం.