Tag Archives: changing the name

Shrihan: ముస్లిం అయిన శ్రీహన్ పేరు మార్చుకోవడానికి కారణం ఏంటి… పేరు వెనుకున్న స్టోరీ ఏంటో తెలుసా?

Shrihan: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా గుర్తింపు సంపాదించుకున్న వారిలో బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ శ్రీహాన్ ఒకరు. ఈయన తాజాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొని రన్నర్ గా 40 లక్షల రూపాయలు తీసుకొని బయటకు వచ్చారు.

ఇక శ్రీహన్ గురించి చాలామందికి తెలియదు ఈయన కేవలం సిరి బాయ్ ఫ్రెండ్ అనే విషయం మాత్రమే చాలా మందికి తెలుసు. ఇక శ్రీహన్ వ్యక్తిగత విషయానికి వస్తే… ఈయన ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఈయనకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.ఈయన యూట్యూబర్ గా రాకముందు నేవీలో మూడు సంవత్సరాల పాటు పని చేశారు.

శ్రీహన్ కు నటనపై ఆసక్తి ఉండటం వల్ల ఆయన షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయమయ్యారు. వైజాగ్ లో జన్మించిన శ్రీహాన్ నటనపై ఆసక్తితో యూట్యూబర్ గా మారి సాఫ్ట్వేర్ బిచ్చగాళ్ళు అనే షార్ట్ ఫిలిం తో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం సిరితో కలిసి ఈయన మరొక షార్ట్ ఫిలిం లో నటించడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది.

Shrihan: అవకాశాల కోసమే పేరు మార్చుకున్నారా….

ఇకపోతే ముస్లిం కుటుంబంలో జన్మించిన శ్రీహన్ ఇలా పేరు మార్చుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈయన పేరు మార్చుకున్నారు? అనే విషయాన్ని వస్తే…
నటనపై ఆసక్తితో ఈయన ఇండస్ట్రీలో కొనసాగడం కోసమే తన పేరు మార్చుకున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా ఇన్ని రోజులు కేవలం యూట్యూబర్ గా మాత్రమే కొనసాగుతున్నటువంటి శ్రీహన్ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.