Shrihan: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా గుర్తింపు సంపాదించుకున్న వారిలో బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ శ్రీహాన్ ఒకరు. ఈయన తాజాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొని రన్నర్ గా 40 లక్షల రూపాయలు తీసుకొని బయటకు వచ్చారు.
ఇక శ్రీహన్ గురించి చాలామందికి తెలియదు ఈయన కేవలం సిరి బాయ్ ఫ్రెండ్ అనే విషయం మాత్రమే చాలా మందికి తెలుసు. ఇక శ్రీహన్ వ్యక్తిగత విషయానికి వస్తే… ఈయన ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఈయనకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.ఈయన యూట్యూబర్ గా రాకముందు నేవీలో మూడు సంవత్సరాల పాటు పని చేశారు.
శ్రీహన్ కు నటనపై ఆసక్తి ఉండటం వల్ల ఆయన షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయమయ్యారు. వైజాగ్ లో జన్మించిన శ్రీహాన్ నటనపై ఆసక్తితో యూట్యూబర్ గా మారి సాఫ్ట్వేర్ బిచ్చగాళ్ళు అనే షార్ట్ ఫిలిం తో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం సిరితో కలిసి ఈయన మరొక షార్ట్ ఫిలిం లో నటించడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది.
ఇకపోతే ముస్లిం కుటుంబంలో జన్మించిన శ్రీహన్ ఇలా పేరు మార్చుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈయన పేరు మార్చుకున్నారు? అనే విషయాన్ని వస్తే…
నటనపై ఆసక్తితో ఈయన ఇండస్ట్రీలో కొనసాగడం కోసమే తన పేరు మార్చుకున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా ఇన్ని రోజులు కేవలం యూట్యూబర్ గా మాత్రమే కొనసాగుతున్నటువంటి శ్రీహన్ బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…