Movie News

Savitri: ఆరోజు సావిత్రి బాగా తాగొచ్చు బోరున ఏడ్చింది… ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జమున!

Savitri: సీనియర్ నటిమని సావిత్రి గురించి పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సావిత్రి చివరి రోజులలో చాలా దుర్భరనీయమైన పరిస్థితులను ఎదుర్కొని మరణించారు.చిత్ర పరిశ్రమలో తన సహజ నటనతో ఎంతోమందిని మెప్పించిన ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఒకానొక సమయంలో స్టార్ హీరోలు కూడా ఈమె డేట్ ల కోసం ఎదురుచూసే స్థాయికి సావిత్రి ఎదిగింది.

ఇలా చిత్ర పరిశ్రమలో సహజ నటిగా మహానటి అనే బిరుదు సంపాదించుకున్న సావిత్రి వ్యక్తిగత జీవితంలో కూడా అంతే ఉదార స్వభావం కలిగి ఉండేవారు. తన వద్దకు ఎవరైనా ఏదైనా కష్టం వచ్చిందని వస్తే చాలు వెనక ముందు ఆలోచించకుండా వారికి సహాయం చేసేవారు.అయితే ఈమె ఎప్పుడైతే నటుడు జెమినీ గణేషన్ను పెళ్లి చేసుకుందో ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులుగా మారిపోయింది.

ఈమె పై ప్రేమతో కాకుండా ఈమె సంపాదించిన ఆస్తి కోసమే జెమినీ గణేషన్ తనని పెళ్లి చేసుకొని తనని చాలా ఇబ్బందులకు గురి చేశారని అందరికీ తెలిసిన సత్యం.ఇక ఇండస్ట్రీలో సావిత్రి జమున ఇద్దరూ అక్క చెల్లెలుగా ఉండేవారు. వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు. అయితే తాజాగా జమున ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సావిత్రి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Savitri: జెమినీ గణేషన్ పెళ్లితో తలకిందులైన సావిత్రి జీవితం….

ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ నేను సావిత్రి ఇద్దరు అక్కచెల్లెళ్లుగా ఉండే వాళ్ళం అయితే నా కుమారుడు బారసాల ఫంక్షన్ కోసం సావిత్రిని ఆహ్వానించాను. ఆరోజు ఆమె ఫుల్లుగా తాగి బారసాల కార్యక్రమానికి వచ్చిందని తెలిపారు. ఇలా తాగి నా కుమారుడిని ఎత్తుకొని ముద్దులు పెట్టిందని అనంతరం తనని ఒక గదిలోకి తీసుకెళ్లి తనని హత్తుకొని బోరున ఏడ్చిందని జమున తెలిపారు.నువ్వు చాలా అదృష్టవంతురాలివే చెల్లి మంచి భర్త కుమారుడు నిండు సంసారం కానీ నాకు ఆ అదృష్టం లేదు అంటూ సావిత్రి ఏడ్చిందని జమున అప్పటి విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago