Jayasudha: తెలుగు చిత్ర పరిశ్రమలో సహజ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ ఎంతో మంది అగ్ర హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించడమే కాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికీ ఈమె పలువురు యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.
ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న జయసుధ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా జయసుధ తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.
ముఖ్యంగా తన భర్త మరణం గురించి మాట్లాడుతూ జయసుధ ఎమోషనల్ అయ్యారు.తన భర్త ఐదు సంవత్సరాల క్రితం మరణించారని అయితే ఆయన మరణించే సమయంలో తాను వేరొక చోట ఉండటం వల్ల చివరికి తన భర్త మరణించిన విషయాన్ని కూడా తన వద్ద దాచిపెట్టారని ఈమె తెలిపారు.
తన భర్త మరణించిన విషయాన్ని తన పిల్లలకు మాత్రమే చెప్పి అమ్మకు చెప్పద్దని చెప్పారు.ఇలా తన భర్త మరణం గురించి తనకు తెలియగానే ఒక్కసారిగా షాక్ అయ్యానని అయితే ఆ సమయంలో జయప్రద నా పక్కనే ఉండి తనకు ఎంతో ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా మరోసారి అప్పటి సంఘటనలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం జయసుధ తన భర్త మరణం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…