Tag Archives: Cheat

Crime news: అతిగా ఆశ పడితే.. బంపర్ ఆఫర్ పేరిట టోకరా..

Crime news: ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. నమ్మితే చాలు డబ్బులు దోచేస్తున్నారు. లాటరీ తగిలిందని.. ఎంతో కొంత డబ్బులు కడితే కస్టమ్స్ క్లియరెన్స్ లభిస్తుందని.. ఇలా మనం కొనని లాటరీకి బంపర్ ఆఫర్ తగిలిందంటూ.. ఫ్రాడ్ చేస్తున్నారు. మనలో ఉన్న అధిక ఆశను దోపిడీదారులు సొమ్ము చేసుకుంటున్నారు. 

Crime news: అతిగా ఆశ పడితే.. బంపర్ ఆఫర్ పేరిట టోకరా..

ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజపేటలో  కూడా ఇలాంటి మోసం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బాధితుడు లింగాల వెంకటేష్ కు బంపర్ ఆఫర్ వచ్చిందని కేవలం… రూ. 1200 చెల్లిస్తే మంచి చీర, ముక్కుపుడక, మెడలో వేసుకునే గొలుసు అందచేస్తామని వారం క్రితం మొబైల్ నెంబర్ 7093492081 నుంచి కాల్ వచ్చినట్లు పేర్కొన్నాడు. 

Crime news: అతిగా ఆశ పడితే.. బంపర్ ఆఫర్ పేరిట టోకరా..

మంగళవారం అదే ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసి మీ ఆఫర్ పార్సిల్ పోస్టాఫీస్ కు వచ్చిందని.. త్వరగా వెళ్లి తీసుకోండని తెలిపారు. ఎంతో ఆనందంగా వెళ్లిన బాధితుడు వెంకటేష్.. అక్కక ఫోస్ట్ మాస్టర్ కు రూ. 1200.. పోస్టల్ ఛార్జీ రూ. 60 చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. 

పార్సిల్ లో కేవలం చీరమాత్రమే ఉంది:

ఎంతో ఆశగా పార్సిల్ తెరిచి చూస్తే.. అందులో కేవలం చీర మాత్రమే ఉందని మిగతా వస్తువులు ఏమీ లేవని వాపోయాడు. ఆ చీర కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతకమ్మ చీరను పోలి ఉందని ఆయన అన్నారు. తిరిగి ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే.. ఎలాంటి స్పందన రాలేదని బాధితుడు వెంకటేష్ వెల్లడించారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఆ పార్శిల్ పైన సాయిగంగ ఏజెన్సీ, ఏటీ కాలనీ, గుంటూరు-522001గా చిరునామా ఉందని తెలిపారు.

ఒక్క క్లిక్ చేశాడు రూ. 4.90 లక్షలు.. పోగొట్టుకున్నాడు.. ఎలాగంటే?

బ్యాంక్ ఖాతాకు.. పాన్ కార్డును లింక్ చేయాలని.. ఆధార్, పాన్ కార్డును కూడా లింక్ చేసుకోవాలని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూనే ఉంది. అయితే అలా చేస్తున్న క్రమంలో అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి మాత్రమే చేసుకోవాలని కూడా సూచించింది. అయితే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లో తమ ఫోన్లకు వచ్చే లింక్ లను ఓపెన్ చేయవద్దని పోలీసులు అవగాహన కార్యక్రమలు కూడా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా కొంతమంది సైబర్ వలలో పడుతున్నారు.

చదువు లేని వాళ్లు అంటే.. తెలిసి.. తెలియక ఇలా చేశారు అనుకుంటే.. చదువుకున్న మూర్ఖులు కూడా ఇలానే చేస్తున్నారు. తర్వాత లబోదిబో మంటూ మొత్తుకొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం రోజూ చూస్తునే ఉన్నాం. అలాంటిదే మరొకటి నిజామాబాద్ లో చోటుచేసుకుంది.

బ్యాంక్‌ ఖాతాకు పాన్‌కార్డు లింక్‌ చేయమని వచ్చిన మెసేజ్‌ ను క్లిక్ ఇచ్చి.. తన అకౌంట్లో ఉన్న దాదాపు రూ. 4.90 లక్షలను పోగొట్టుకున్నాడు ఓ బాధితుడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ లోని కంఠేశ్వర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి బ్యాంక్‌ అకౌంట్‌కు పాన్‌కార్డు లింక్‌ చేయాలని సెప్టెంబర్‌ 30వ తేదీ మెసేజ్‌ వచ్చింది. అలాగే అతడు లింక్ ను ఓపెన్ చేసి అన్ని వివరాలను ఇచ్చాడు.

తర్వాత వెంటనే మరో వ్యక్తి ఫోన్ చేసి ఎస్ బీఐ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి.. మొబైల్ కు వచ్చిన ఓటీపీ చెప్పమన్నారు. ఆ నంబర్‌ చెప్పిన కాసేపటికే తన బ్యాంక్‌ ఖాతాలోని రూ.4.90 లక్షల విత్‌డ్రా అయినట్లు మెస్సేజ్‌ వచ్చింది. వెంటనే సదరు వ్యక్తి వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. ఓటీపీని అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని సూచించారు.