Crime news: అతిగా ఆశ పడితే.. బంపర్ ఆఫర్ పేరిట టోకరా..
Crime news: ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. నమ్మితే చాలు డబ్బులు దోచేస్తున్నారు. లాటరీ తగిలిందని.. ఎంతో కొంత డబ్బులు కడితే కస్టమ్స్ క్లియరెన్స్ లభిస్తుందని.. ఇలా మనం కొనని లాటరీకి బంపర్ ఆఫర్ తగిలిందంటూ.. ఫ్రాడ్ చేస్తున్నారు. మనలో ఉన్న అధిక ఆశను దోపిడీదారులు సొమ్ము చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజపేటలో కూడా ఇలాంటి మోసం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బాధితుడు లింగాల వెంకటేష్ కు బంపర్ ఆఫర్ వచ్చిందని కేవలం… రూ. 1200 చెల్లిస్తే మంచి చీర, ముక్కుపుడక, మెడలో వేసుకునే గొలుసు అందచేస్తామని వారం క్రితం మొబైల్ నెంబర్ 7093492081 నుంచి కాల్ వచ్చినట్లు పేర్కొన్నాడు.
మంగళవారం అదే ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసి మీ ఆఫర్ పార్సిల్ పోస్టాఫీస్ కు వచ్చిందని.. త్వరగా వెళ్లి తీసుకోండని తెలిపారు. ఎంతో ఆనందంగా వెళ్లిన బాధితుడు వెంకటేష్.. అక్కక ఫోస్ట్ మాస్టర్ కు రూ. 1200.. పోస్టల్ ఛార్జీ రూ. 60 చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు.
ఎంతో ఆశగా పార్సిల్ తెరిచి చూస్తే.. అందులో కేవలం చీర మాత్రమే ఉందని మిగతా వస్తువులు ఏమీ లేవని వాపోయాడు. ఆ చీర కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతకమ్మ చీరను పోలి ఉందని ఆయన అన్నారు. తిరిగి ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే.. ఎలాంటి స్పందన రాలేదని బాధితుడు వెంకటేష్ వెల్లడించారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఆ పార్శిల్ పైన సాయిగంగ ఏజెన్సీ, ఏటీ కాలనీ, గుంటూరు-522001గా చిరునామా ఉందని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…