Tag Archives: child care leave

కేంద్రం సంచలన నిర్ణయం.. పురుషులకు శిశు సంరక్షణ సెలవులు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పురుష ఉద్యోగులు సైతం శిశు సంరక్షణ సెలవులు తీసుకునే అవకాశం కల్పించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. విడాకులు తీసుకున్న వాళ్లు, పెళ్లి అయినా భార్య చనిపోయిన వాళ్లు, ఒక్కరే పేరెంట్ గా ఉన్నవాళ్లు తమ పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సి వస్తే శిశు సంరక్షణ సెలవులు తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.

తప్పనిసరిగా పిల్లల బాధ్యతలు చూసుకోవాల్సిన తండ్రులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని కేంద్రం చెబుతోంది. కేంద్రం నిర్ణయం ద్వారా సింగిల్‌ పేరెంట్‌ పురుష ఉద్యోగులు 365 రోజుల సెలవులకు 80 శాతం జీతాన్ని పొందవచ్చు. సాధారణంగా ఉద్యోగులకు పర్యాటక సెలవుల ప్రయోజనాలు లభిస్తాయనే సంగతి తెలిసిందే. కేంద్రం శిశు సంరక్షణ సెలవులో ఉన్న పురుషులు సైతం పర్యాటక సెలవుల ప్రయోజనాలను పొందవచ్చు.

పిల్లలు శారీరక లేదా మానసిక సమస్యలతో బాధ పడుతుంటే పిల్లలకు 22 సంవత్సరాలు వచ్చే వరకు శిశు సంరక్షణ సెలవులు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే కేంద్రం తాజాగా ఈ నిబంధనలను పూర్తిస్థాయిలో సవరించింది. కేంద్రం పురుషులకు చైల్డ్ కేర్ లీవులను ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆలనాపాలనా చూసుకునే తండ్రులకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

గత కొన్నేళ్ల నుంచి పురుష ఉద్యోగులలో కొందరు పురుష ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవులను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చైల్డ్ కేర్ లీవులు లేకపోవడం వల్ల పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నయని తెలుపుతున్నారు. కేంద్రం పురుష ఉద్యోగుల విజ్ఞప్తులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.