Tag Archives: chiru hatricks

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన”డబుల్ హ్యాట్రిక్” ఇండస్ట్రీ హిట్ మూవీస్.. ఇది సినీ చరిత్రలో ఓ అరుదైన రికార్డ్.!!

1978 మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం… ప్రాణంఖరీదు, మనఊరి పాండవులు, శుభలేఖ, అభిలాష, చాలెంజ్, ఖైదీ, అడవి దొంగ, కొండవీటిరాజా లాంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకు వెళ్తున్న..

ఆయన సినీ ఖాతాలో 1987 మొదలుకొని 1992 వరకు నిరాటంకంగా ఆరు సంవత్సరాలు ‘డబుల్ హ్యాట్రిక్ ‘ ఇండస్ట్రీహిట్స్ సినీపరిశ్రమకు అందించడం జరిగింది.

1987 గీతా ఆర్ట్స్ నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘పసివాడి ప్రాణం’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. మొదటగా ఈ చిత్రాన్ని మలయాళంలో రూపొందించగా గీతాఆర్ట్స్, రీమేక్ హక్కులు తీసుకొని పసివాడి ప్రాణం చిత్రాన్ని రూపొందించారు. ఇది ఆ సంవత్సరానికి ఇండస్ట్రీహిట్ గా నిలిచింది.

1988 జి.వి.నారాయణ రావు అండ్ ఫ్రెండ్స్ నిర్మాణం, రవిరాజాపినిశెట్టి దర్శకత్వంలో ‘యముడికి మొగుడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి, రాధ హీరో, హీరోయిన్లుగా నటించారు. యముని కథతో కూడిన చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. రాజ్ కోటి ఇచ్చిన సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఆ సంవత్సరానికి గాను యముడికి మొగుడు ఇండస్ట్రీహిట్ గా నిలిచింది.

1989 గీతాఆర్ట్స్ నిర్మాణం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “అత్తకి యముడు అమ్మాయికి మొగుడు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. అత్తా అల్లుళ్ళసవాల్, ప్రతి సవాల్ లతో కూడిన చిత్రం కావడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

1990 అశ్వినీదత్ నిర్మాణం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో “జగదేక వీరుడు అతిలోక సుందరి ” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి ఇంతకుముందు తీసిన చిత్రాలకు భిన్నంగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆ సంవత్సరానికి ఈ చిత్రం బాక్సాఫీస్ ని చెడుగుడు లాడించింది.

1991 మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణం, విజయబాపినీడు దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్ ‘చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ తో మెగాస్టార్ అభిమానులను అలరించారు. బప్పిలహరి సంగీతం ఆనాటి కుర్రకారును కుర్చీలోనే డాన్స్ వేసేలా చేసింది. ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది.

1992 దేవి ఫిలిమ్ ప్రొడక్షన్స్ నిర్మాణం,కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఘరానా మొగుడు’ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, నగ్మా హీరో, హీరోయిన్లుగా నటించారు. గర్వంతో ఫ్యాక్టరీ యజమానురాలుగా ఉన్న నగ్మాను పెళ్లిచేసుకొని ఆమెకు గుణపాఠం చెప్పే పాత్రలో చిరంజీవి నటించారు. ఎం.ఎం.కీరవాణి అందించిన పాటలు ప్రేక్షకులను నిలకడగా కూర్చోకుండా చేశాయి. ఈ సినిమా ఆ సంవత్సరానికి ఇండస్ట్రీహిట్ గా నిలిచింది. ఈ విధంగా ఆర్డర్ తప్పకుండా మెగాస్టార్ నటించిన 6 చిత్రాలు ఇండస్ట్రీహిట్ గా నిలవడం సినీ చరిత్రలో ఒక రికార్డుగా మిగిలిపోయింది.