Tag Archives: city

Trains: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్..! వందే భారత్ రైళ్లు నగరానికి కూడా..!

Trains: దేశంలోనే హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోంది. ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటోంది. దీనికోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే నగరంలోని ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎక్కడిక్కడ ఫ్లై ఓవర్లను నిర్మిస్తోంది.

Trains: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్..! వందే భారత్ రైళ్లు నగరానికి కూడా..!

ఇదిలా ఉంటే స్థిరమైన ప్రభుత్వంతో పాటు, హైదరాబాద్ కు ఉన్న భౌగోళిక అనుకూలతలు పెట్టుబడును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సౌత్ ఇండియాలోనే కమర్షియల్ హబ్ గా హైదరాబాద్ మారుతోంది. ప్రభుత్వం తీసుకున్న సులభతర అనుమతులు కూడా పలు ప్రతిష్టాత్మక కంపెనీలు రావడాని దోహదపడుతున్నాయి. 

Trains: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్..! వందే భారత్ రైళ్లు నగరానికి కూడా..!

ఇంతలా డెవలప్ అవుతున్న హైదరాబాద్ మరిన్ని సౌకర్యాలు రాబోతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ లో హైదరాబాద్ నగరానికి వందేభారత్ ట్రైన్లను కేటాయించారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 400 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని కేంద్రం బడ్జెట్ లో తెలిపింది.

భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం..

ఈ నేపథ్యంలో గతంలో ప్రతిపాదించినట్లు హైదరాబాద్- న్యూ ఢిల్లీ, కాచిగూడ- బెంగళూర్, సికింద్రాబాద్- ముంబైల మధ్య వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా… ఈ బడ్జెట్ లో 400 రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు హైదరాబాద్- ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కూడా ఉంది. ఇప్పటికే అహ్మదాబాద్- ముంబై మధ్య జపాన్ సహకారంతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. రానున్న రోజుల్లో హైదరాబాద్- ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే గంటల వ్యవధిలోనే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం వీలవుతుంది.

నగరం నుంచి ఆ ఎయిర్ పోర్ట్ కు చేరుకోవాలంటే కేవలం రూ.10 టికెట్..!

సాధారణంగా విమానాశ్రయాలు నగరానికి పదుల సంఖ్యలో కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. నగరం నుంచి విమానాశ్రయానికి చేరుకోవాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.వేలల్లో కాకపోయినా ఆర్.టి.సి బస్సులో ప్రయాణించిన కూడా దాదాపు ఐదారు వందల వరకు ఖర్చు అవుతుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నగరం నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్లాలనుకునేవారు ప్రత్యేక రైళ్ల ద్వారా కేవలం పది రూపాయలు చెల్లించి సరైన సమయానికి విమానాశ్రయం చేరుకొనే అవకాశం కల్పించింది.

బెంగళూరు కమ్యూటేటర్స్ కు రిలీఫ్ ఇచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ స్పెషల్ ట్రైన్ సర్వీస్ స్టార్ట్ చేసింది. బెంగళూరు నుంచి కెంపెగౌడ ఎయిర్‌పోర్టు వరకూ వెళ్లేందుకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేశారు.సౌత్ వెస్టరన్ రైల్వే దేవనహల్లి స్టేషన్ వరకూ సర్వీస్ మొదలుపెట్టింది. రోడ్ రహిత్, ఫాస్ట్, ఖరీదైన కొత్త సర్వీసును ప్రొవైడ్ చేస్తుంది. సిటీ నుంచి ఎవరైనా సిటీ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లాలంటే ఈ ట్రైన్ ల ద్వారా కేవలం పది రూపాయలకు చెల్లించి వెళ్ళవచ్చు.

ఈ విధంగా విమానాశ్రయాలకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా వెళ్లే వారు చాలామంది ట్రైన్లలో ప్రయాణిస్తే నగరంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా సోమవారం నుంచి ఈ సేవలు ప్రారంభం కావడంతో నగరంలో ఉండే ప్రజలు కెంప గౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు ట్రైన్లలో వెళ్ళవచ్చని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా మరో ఐదారు నెలల్లో ఇదే రూట్ లో మరికొన్ని రైళ్లను కూడా నడిపే ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు తెలియజేశారు.