సాధారణంగా విమానాశ్రయాలు నగరానికి పదుల సంఖ్యలో కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. నగరం నుంచి విమానాశ్రయానికి చేరుకోవాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.వేలల్లో కాకపోయినా ఆర్.టి.సి బస్సులో ప్రయాణించిన కూడా దాదాపు ఐదారు వందల వరకు ఖర్చు అవుతుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నగరం నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్లాలనుకునేవారు ప్రత్యేక రైళ్ల ద్వారా కేవలం పది రూపాయలు చెల్లించి సరైన సమయానికి విమానాశ్రయం చేరుకొనే అవకాశం కల్పించింది.
బెంగళూరు కమ్యూటేటర్స్ కు రిలీఫ్ ఇచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ స్పెషల్ ట్రైన్ సర్వీస్ స్టార్ట్ చేసింది. బెంగళూరు నుంచి కెంపెగౌడ ఎయిర్‌పోర్టు వరకూ వెళ్లేందుకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేశారు.సౌత్ వెస్టరన్ రైల్వే దేవనహల్లి స్టేషన్ వరకూ సర్వీస్ మొదలుపెట్టింది. రోడ్ రహిత్, ఫాస్ట్, ఖరీదైన కొత్త సర్వీసును ప్రొవైడ్ చేస్తుంది. సిటీ నుంచి ఎవరైనా సిటీ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లాలంటే ఈ ట్రైన్ ల ద్వారా కేవలం పది రూపాయలకు చెల్లించి వెళ్ళవచ్చు.
ఈ విధంగా విమానాశ్రయాలకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా వెళ్లే వారు చాలామంది ట్రైన్లలో ప్రయాణిస్తే నగరంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా సోమవారం నుంచి ఈ సేవలు ప్రారంభం కావడంతో నగరంలో ఉండే ప్రజలు కెంప గౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు ట్రైన్లలో వెళ్ళవచ్చని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా మరో ఐదారు నెలల్లో ఇదే రూట్ లో మరికొన్ని రైళ్లను కూడా నడిపే ఆలోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…