Tag Archives: comedian satya

Comedian Satya: ఇండస్ట్రీలోకి రాకముందు కమెడియన్ సత్య ఎలాంటి పనులు చేసేవారో తెలుసా?

Comedian Satya: తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ గా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఒకప్పుడు కమెడియన్ అంటే బ్రహ్మానందం,అలీ వేణుమాధవ్ సుధాకర్ వంటి వారు మాత్రమే గుర్తుకొచ్చేవారు. ప్రస్తుత కాలంలో కమెడియన్స్ అంటే వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య వంటి తదితరులు గుర్తుకొస్తారు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సత్య ఒకరు తాజాగా ఈయన నాగశౌర్య హీరోగా నటించిన రంగ బలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సత్య కామెడీ చాలా హైలెట్ అయిందని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో సక్సెస్ అయినటువంటి సత్య ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు అనే విషయానికి వస్తే…

ఈయన సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చి జీవనం కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూనే అన్నపూర్ణ స్టూడియో చుట్టూ అవకాశాల కోసం ప్రదక్షిణలు చేసేవారట. ఇలా ప్రయత్నాలు చేస్తూనే ఈయన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని తెలుస్తుంది అయితే అప్పటికే ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన ధనరాజ్ జబర్దస్త్ కార్యక్రమంలో కూడా కొనసాగే వారు.

Comedian Satya:జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్…


ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలోకి సత్యని ఆహ్వానించి ఆయనకు అవకాశాలు కల్పించారు. ఇలా కొంతకాలం పాటు జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ తనని తాను నిరూపించుకున్నటువంటి సత్యం అనంతరం సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన పిల్ల జమిందార్ అనే సినిమా ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ సాధించారు అనంతరం ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా మారిపోయారు.

Comedian Satya: దాని కోసం నాంపల్లి ఆసుపత్రిలో అద్దాలను తుడిచా..! ప్రముఖ కమెడియన్ ఆవేదన.. !

Comedian Satya: నిజంగా టాలెంట్, కష్టపడేతత్వం ఉండాలి కానీ సినిమా పరిశ్రమ అక్కున చేర్చుకుంటుంది. లేకపోతే అదే సినిమా పరిశ్రమలో సాధారణ స్థితిలోనే ఉండిపోతాం. ఎంతోమంది సినిమా రంగంపై మక్కువతో సొంత వాళ్లని వదిలి హైదరాబాద్ కృష్ణానగర్ చేరుతుంటారు.

Comedian Satya: దాని కోసం నాంపల్లి ఆసుపత్రిలో అద్దాలను తుడిచా..! ప్రముఖ కమెడియన్ ఆవేదన.. !

తమ టాలెంట్ తో దర్శక నిర్మాతలు ఒప్పిస్తే చాలు వారి ఫేట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా … ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో నిలదొక్కుకుంటున్న కమెడియన్ సత్య గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం హీరోల ఫ్రెండ్ గా కమెడియన్గా ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల వివాహ భోజనంబు సినిమాల్లో హీరోగా పరిచయమయ్యాడు. గద్దలకొండ గణేష్ లో మంచి క్యారెక్టర్ ప్లే చేశారు.

Comedian Satya: దాని కోసం నాంపల్లి ఆసుపత్రిలో అద్దాలను తుడిచా..! ప్రముఖ కమెడియన్ ఆవేదన.. !

ఇదిలా ఉంటే తన తొలినాళ్ళలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు సత్య. సినిమాల పైన ఇంట్రెస్ట్ తో సొంతూళ్లను వదిలి హైదరాబాద్ వచ్చాడు. ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసి సినిమాపై మక్కువతో దర్శకుడు కావాలని వచ్చాడు. చివరకు కమెడియన్గా వేషాలు సంపాదించుకుంటున్నాడు. అయితే తొలినాళ్ళలో హైదరాబాద్ వచ్చినప్పుడు సత్యను… కుటుంబ సభ్యులు మళ్లీ ఇంటికి తీసుకెళ్లారు. కానీ సత్య ఆలోచనలు మారలేదు. దీంతో వాళ్ళ నాన్న చేతికి 10,000 రూపాయలు ఇచ్చి హైదరాబాద్ పంపించాడు.


జూనియర్ ఆర్టిస్టులు పరిచయమయ్యారని.. ..

అలా హైదరాబాద్ కి వచ్చిన తొలినాళ్లలో జీవితం సాఫీగా సాగిన తర్వాత డబ్బులు అయిపోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. పని కోసం నాంపల్లి లో ఆసుపత్రి అద్దాలను తుడిచానని చెప్పుకొచ్చాడు. ఇలా చేస్తే రోజుకు రూ. 200 ఇచ్చేవారని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ లు పరిచయం అవడం తో వారితో మాట కలిపా అని .. వాళ్ళు చెప్పిన చోటికి వెళ్తే షూటింగ్ చూడొచ్చని చెప్పారని తెలిపాడు. మరుసటి రోజు అక్కడికి వెళ్ళాక 500 రూపాయలు తీసుకొని షూటింగ్ జరుగుతున్న చోటు పంపించారు. ఇదే తన జీవితంలో తొలిసారిగా షూటింగ్ చూడటం అని చెప్పుకొచ్చారు. అక్కడ మరి కొందరు జూనియర్ ఆర్టిస్టులు పరిచయమయ్యారని.. వాళ్లతో కలిసి షూటింగ్లకు వెళ్లానని… అలా ఓ సినిమా షూటింగ్ కి వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ లో ఒకరు నా దగ్గరున్న డబ్బులు తీసుకొని పారిపోయారని సత్య తెలిపాడు. దీంతో మూడు రోజుల పాటు మంచినీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నానని అన్నాడు సత్య. అలా తన బాధను ఫోన్లో తల్లికి తెలియజేశాడు. తండ్రికి విషయం తెలియడంతో ఆయన వచ్చి తనని ఇంటికి తీసుకెళ్లాలని సత్య చెప్పుకొచ్చారు. వాళ్ల నాన్నకు తెలిసిన స్నేహితులు బంధువుల ద్వారా ‘ద్రోణ’ సినిమా కి దర్శకత్వ విభాగంలో చేరారు. ఇలా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ ప్రస్తుతం నటుడిగా అలరిస్తున్నారు సత్య.