Tag Archives: control diabetes

షుగర్ వ్యాధి కంట్రోల్ కావాలంటే… ఇవి తినాల్సిందే!

ప్రస్తుతం కాలంలో ఎంతో మంది బాధ పడుతున్న సమస్యలలో షుగర్ వ్యాధి సమస్య ఒకటి. షుగర్ వ్యాధితో బాధ పడేవారు వారి ఆహార నియమాలలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. ముఖ్యంగా టైప్ డయాబెటిస్తో బాధపడే వారు వారి ఆహార విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూనే శారీరక వ్యాయామాలు వంటివి చేయడం వల్ల షుగర్ వ్యాధిని అదుపు చేసుకోవచ్చు.

షుగర్ వ్యాధితో బాధ పడేవారు సూపర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ పదార్థాలలో హెల్దీ ఫ్యాట్స్ ఉండడం వల్ల అవి హార్ట్ డిసీజ్‌ని ప్రివెంట్ చేస్తాయని, వాటిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి అవి డయాబెటీస్ కంట్రోల్ చేస్తాయని చెప్పవచ్చు. మరి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే ఫుడ్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

బెర్రీస్: బెర్రీస్ లో ఎక్కువ భాగం మనకు ఫైబర్ లు లభిస్తాయి. అదేవిధంగా ఈ పండ్లలో ఎక్కువగా న్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఇవి షుగర్ వ్యాధిని అదుపు చేయడమే కాకుండా వివిధ రకాల క్యాన్సర్ కణాలను అణచివేస్తూ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ముదిరిన ఆకుపచ్చ కూరలు: ముదిరిన ఆకుపచ్చ ఆకుకూరలలో ఎక్కువభాగం మనకు ఫైబర్, విటమిన్లు, క్యాల్షియం, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి షుగర్ వ్యాధితో పాటు ఇతర వ్యాధులను అదుపుచేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి.

పప్పు ధాన్యాలు: పప్పు ధాన్యాలను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఈక్రమంలోనే రక్తపోటును అదుపు చేస్తుంది. ఈ పప్పుధాన్యాలలో అధిక భాగం విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు గ్రీన్ టీ, నట్స్, ఆలివ్ ఆయిల్, సాల్మన్ చేపలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.