Tag Archives: corona seocnd wave

మాస్కులు లేకుంటే డెల్టా ప్లస్ సోకే ప్రమాదం ఎక్కువ?

ఇప్పుడిప్పుడే కరోనా రెండవ దశ అయిన డెల్టా వేరియంట్ నుంచి దేశం కోలుకుంటోంది. ఈ క్రమంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు 40 నమోదు కాగా ఇందులో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మృత్యువాత పడింది. దీంతో అధికారులు డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డెల్టా ప్లస్ వేరియంట్ రెండవదశ కన్నా ఎంతో సమర్థవంతమైనదని, ఈ వేరియంట్ కి తొందరగా వ్యాప్తి చెందే గుణం ఉందని, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే డెల్టా ప్లస్ వేరియంట్లను అదుపు చేయాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి మాస్కులు లేకుండా వెళ్లిన ఆ వైరస్ మనకు వ్యాపించే అవకాశం ఉందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఇటీవల వెల్లడించారు.

ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకినవారిలో మృతి చెందిన మహిళ ఇప్పటివరకు ఎలాంటి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి లేదని అధికారులు తెలియజేశారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలని, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, శానిటైజర్ లు వాడటం, భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.

డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని అందుకోసమే దీనిని వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తొందరపడి లాక్ డౌన్ సడలించవద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధమైనటువంటి డెల్టా ప్లస్ వేరియంట్ ను అధికారులు మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ లో గుర్తించినట్టు తెలిపారు. డెల్టా వేరియంట్ లోని స్పైక్ ప్రొటీన్‌లో ‘కే417’ జన్యు మార్పు జరిగి కొత్త వేరియంట్‌ పుట్టిందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఈ దశలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రమాదమంటున్న నిపుణులు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో వ్యాపించి ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే మూడో దశ వ్యాప్తి చెందుతుందని ఇది మరింత ప్రమాదకరంగా మారబోతుందని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడవ దశను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

తాజాగా రెయిన్ బో చిన్నపిల్లల ఆసుపత్రి ఛైర్మన్‌, ఎండీ, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ రమేష్‌ కంచర్ల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ గర్భిణీ మహిళ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన వెంటిలేటర్ చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

రెండవ దశ కరోనా తీవ్రత గర్భిణీ స్త్రీల పై పడటంతో వారు కోలుకోవడానికి కష్టమైందని మరి కొందరిలో వ్యాధి తీవ్రత అధికంగా ఉండటం వల్ల వారికి చికిత్స అందించాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు.సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భిణీ స్త్రీలు శరీర బరువు పెరగడంతో పాటు వారిలో ఊపిరితిత్తుల ప్రక్రియ సక్రమంగా పనిచేయదు. ఈ క్రమంలోనే వారిలో ఆక్సిజన్ శాతం క్రమంగా తగ్గిపోతుందని వైద్య అధికారులు తెలిపారు.

కరోనా రెండవ దశలోనే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలు మూడవ దశ వ్యాప్తి చెందితే మరింత తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వీరు హెచ్చరించారు. మూడవ దశ గర్భిణీలలో వ్యాపిస్తే సాధారణ వ్యక్తుల కంటే వీరు ఎక్కువ ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయి.గర్భిణీ స్త్రీలలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఊపిరితిత్తుల పైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి కనుక తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే భారీ నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు ఈ సందర్భంగా హెచ్చరించారు.