Tag Archives: corral rice

Health Benefits: కొర్రల అన్నం తినే అలవాటు ఉందా..! అయితే ఈ వ్యాధి మీకు దరి చేరదు..!

Health Benefits: ప్రస్తుత జీవితంలో చాలా వరకు వర్క్ కు ప్రాధాన్యత ఇచ్చి…. ఫుడ్ ను అశ్రద్ధ చేస్తున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ పుడ్, ఫిజ్జా, బర్గర్లను ఎక్కువగా తింటున్నారు. సంతులిక ఆహారం అన్న మాటే మరిచారు. మనం తినే దాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధాపడి ఉంటుంది.

Health Benefits: కొర్రల అన్నం తినే అలవాటు ఉందా..! అయితే ఈ వ్యాధి మీకు దరి చేరదు..!

మన ఆహారమే షుగర్ వంటి వ్యాధులకు కారణం అవుతోంది.  ముఖ్యంగా మిల్లెట్స్ ను పట్టించుకోవడమే లేదు. చిరు ధాన్యాల వల్ల చాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో కొర్రలు సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో మిల్లెట్స్ వాడకం చాలా పెరిగింది.

Health Benefits: కొర్రల అన్నం తినే అలవాటు ఉందా..! అయితే ఈ వ్యాధి మీకు దరి చేరదు..!

వ్యాధుల ప్రభావం కావచ్చు, జనాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడం కావచ్చు… వీటి వాడకం ఎక్కువగా పెరిగింది. ఒకప్పుడు పల్లెలకే పరిమితం అయిన కొర్రల వాడకం ఇప్పడు నగరాలకు కూడా విస్తరించింది. కొర్రలను బియ్యాలో కలుపుకుని తింటున్నారు

ఐరన్ మూలకం ఎక్కువగా..

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలతో చాలా లాభాలు ఉన్నాయి. షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంటే గుణం కొర్రలకు ఉంది. కొర్రల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల.. జీర్ణం బాగా అయి.. డయాబెటిస్, అధిక బరువు తగ్గేందుకు సహాయపడుతోంది. కొర్రల్లో 8 శాతం ఫైబర్.. 12 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఇంతే కాకుండా కొర్రల్లో ఐరన్ మూలకం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తహీనత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నరాల బలహీనత, బీపీ, ఆస్తమా ఉన్నవారికి కొర్రలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపే మోరెల్ విటమిన్ వీటిలో ఉంటుంది. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచి వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ ని తగ్గిస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి కొర్రలు. కొర్రలను అన్నంగా కానీ పిండి చేసుకుని కానీ ఆహారంగా వినియోగించుకోవచ్చు.