Tag Archives: Crocodile Attack Wildebeest

ముసలి నుంచి క్షణాల్లో తప్పించుకున్న దున్న.. వీడియో వైరల్..!

మనం చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం. ముసలికి నీటిలో కొండంత బలం ఉటుంది. వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అది నిజమే.. నీటిలో ఉన్నంత వరకు ముసలిని ఎంతటి అడవి రాజు అయినా ఏం చేయలేరు. నీళ్లలో ఎంతటి బలమైన జంతువైనా మొసలికి ఆహారం కావాల్సిందే. అందుకే మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. పెద్ద పెద్ద జంతువులను పట్టి తనకు ఆహారంగా మార్చుకున్న సంఘటనలు మనం ఎన్నో చూశాం.

టీవీలోని డిస్కవరీ చానల్ లో ఇటువంటివి మనకు కనిపిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. మొసలి నోటికి చిక్కినట్లే చిక్కి అడవి దున్న తప్పించుకుంది. ఓ ఆఫ్రికన్ అడవి దున్న నదిని దాటుతుంది. సరిగ్గా మధ్యకు వచ్చేసరికి దానిపై మొసలి మెరుపు దాడి చేస్తుంది.

తన పదునైన దవడలతో అడవి దున్నను నీటిలోకి లాగేందుకు మొసలి తీవ్రంగా ప్రయత్నించింది. ముసలికి ఏమనిపించిందో ఏమో గాని దానిని నోటిలో కరుచుకొని ఒడ్డు దగ్గరకు తీసుకొచ్చింది. అది గమనించిన దున్న ఒక్కసారిగా బయటపడేందుకు ప్రయత్నించింది. అడవి దున్న తన శక్తిని మొత్తం కూడగట్టుకుని.. ఆ మొసలి నుంచి తప్పించుకుంటుంది.

ఎలాగోలా ఒడ్డుకు చేరుకుంటుంది. ఇది సోషల్ మీడియలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. దున్న ధైర్యానికి ఎంతో మంది మెచ్చకొని.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.