మనం చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం. ముసలికి నీటిలో కొండంత బలం ఉటుంది. వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అది నిజమే.. నీటిలో ఉన్నంత వరకు ముసలిని ఎంతటి అడవి రాజు అయినా ఏం చేయలేరు. నీళ్లలో ఎంతటి బలమైన జంతువైనా మొసలికి ఆహారం కావాల్సిందే. అందుకే మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. పెద్ద పెద్ద జంతువులను పట్టి తనకు ఆహారంగా మార్చుకున్న సంఘటనలు మనం ఎన్నో చూశాం.
టీవీలోని డిస్కవరీ చానల్ లో ఇటువంటివి మనకు కనిపిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. మొసలి నోటికి చిక్కినట్లే చిక్కి అడవి దున్న తప్పించుకుంది. ఓ ఆఫ్రికన్ అడవి దున్న నదిని దాటుతుంది. సరిగ్గా మధ్యకు వచ్చేసరికి దానిపై మొసలి మెరుపు దాడి చేస్తుంది.
తన పదునైన దవడలతో అడవి దున్నను నీటిలోకి లాగేందుకు మొసలి తీవ్రంగా ప్రయత్నించింది. ముసలికి ఏమనిపించిందో ఏమో గాని దానిని నోటిలో కరుచుకొని ఒడ్డు దగ్గరకు తీసుకొచ్చింది. అది గమనించిన దున్న ఒక్కసారిగా బయటపడేందుకు ప్రయత్నించింది. అడవి దున్న తన శక్తిని మొత్తం కూడగట్టుకుని.. ఆ మొసలి నుంచి తప్పించుకుంటుంది.
ఎలాగోలా ఒడ్డుకు చేరుకుంటుంది. ఇది సోషల్ మీడియలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. దున్న ధైర్యానికి ఎంతో మంది మెచ్చకొని.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…