Featured

కృష్ణ – చిరంజీవి ఇద్దరు ఒకప్పుడు తోడు దొంగలు అని మీకు తెలుసా..!!

ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు వంటి హేమాహేమీలు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న తరుణంలో 1960వ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. శోభన్ బాబు ఫ్యామిలీ టైప్ సినిమాలు చేస్తున్నాప్పుడు, సూపర్ స్టార్ కృష్ణ మాత్రం కౌబాయ్ (మోసగాళ్లకు మోసగాడు) జేమ్స్ బాండ్ (గూడచారి 116) క్రైమ్ థ్రిల్లర్(అవేకళ్ళు) వంటి సినిమాలతో కొత్త ప్రభంజనాన్ని తెలుగు సినీ పరిశ్రమలో సృష్టించడం జరిగింది. ఈ ప్రభంజనం ఇలా కొనసాగుతున్న క్రమంలో అటు ఇటు గా 1980 దశకంలో వచ్చిన చిరంజీవి తన డాన్స్ ఫైట్లతో (ఖైదీ, పసివాడి ప్రాణం) తెలుగు సినీ పరిశ్రమ గమనాన్ని మార్చారు.

ఇద్దరు హేమాహేమీలు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందని దర్శకుడు కె.వాసు ఆలోచించారు.అలా వీరు ఇద్దరూ తోడు దొంగలుగా వచ్చి బాక్సాఫీసును కొల్లగొట్టారు.1981 కె.వాసు దర్శకత్వంలో వచ్చిన తోడు దొంగలు చిత్రంలో కృష్ణ, చిరంజీవి, గీతా, మధుమాలిని, హీరో, హీరోయిన్లుగా నటించారు. కృష్ణ (కృష్ణ) కిషోర్ (చిరంజీవి) వీరిద్దరూ తోడు దొంగలు. వీరు జీవనోపాధికి కష్టపడి పని చేయకుండా దొంగతనాలు చేసి జీవిస్తుంటారు. ఆ క్రమంలో ఒక బార్ లో గొడవ చేయడం, ఆ గొడవ సద్దుమణిగేలా కృష్ణ వెళ్లి బేరసారాలు చేయడం లాంటివి చేస్తుంటారు. అలాగే నకిలీ ప్రమాదాన్ని సృష్టించడం దాన్ని ఆధారంగా చేసుకుని డబ్బులు గుంజడం లాంటివి చేస్తూ.. తమ దొంగతన కార్యక్రమాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తుంటారు.

అనుకోకుండా కిషోర్(చిరంజీవి) గీత ప్రేమలో పడతాడు. అలాగే కృష్ణ కూడా మధు మాలిని ఇష్టపడతాడు. దుష్ట పాత్రలో రావు గోపాల్ రావు, అతిధి పాత్రలో సత్యనారాయణ, కాంతారావు ప్రభాకర్ రెడ్డి వంటి నటులు ఇందులో కనిపిస్తారు. అలాగే ఈ సినిమాకి సత్యం సంగీత దర్శకత్వం వహించడం జరిగింది. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 1981 లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయాన్ని చవిచూసింది.సూపర్ స్టార్ కు మెగాస్టార్ కు ఈ సినిమా ఒక జ్ఞాపకంగా మాత్రమే ఉండిపోయింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago