కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మిగులుతుంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేయకుండా ఈ అందగత్తె నిద్రపోదు. ఇంత చేస్తున్న ఆమె సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేసినా ఆమె మాత్రం రూట్ మార్చలేదు. ఆమె అనుకున్నది చెప్పాల్సిందే. దీనికి ఆమె చెల్లి కూడా ఎప్పుడూ ఆజ్యం పోస్తూ ఉంటుంది.
వివాదాల్లో ప్రధానమైన వాటిని ఏరితే తప్పకుండా మనకు దొరికేవి మహేశ్ భట్, ఆలియా భట్ పై ఆమె చేసిన ఆరోపణలు. కరణ్ జోహర్ తరువాత కంగనా వద్ద నుంచీ అంతగా సెగ ఎదుర్కొంది మహేశ్ భట్, ఆలియానే. నిజానికి మహేశ్ భట్ ‘వో లమ్హే’ సినిమాలో మంచి పాత్రని అందించాడు కంగనాకి. అది ఆమె కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పుకుంటూనే ఏనాడు వాళ్లను మన్నించలేదు.
వీలైనప్పుడల్లా ఏకి పారేసింది. ఆమెతో పాటు ఆమె సోదరి రంగోలీ ఛండేల్ కూడా భట్ ఫ్యామిలీని సొషల్ మీడియాలో చాలా రోజులు టార్గెట్ చేసింది. కంగనా, రంగోలి మాటలతో హర్టైన ఆలియా తల్లి సోనీ రాజ్దాన్ 2006లో ఓ ట్వీట్ చేసింది. మహేశ్ భట్ తనకి బ్రేక్ ఇచ్చినా కూడా కంగనా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తోందని ఆమె వాపోయింది.
రంగోలి ఆ ట్వీట్ కు సమాధానం చెబుతూ.. కగనాకు అసలు మొదటి చిత్రం అందించింది అనురాగ్ బసు అంటూ గుర్తు చేసింది. ‘వో లమ్హే’ తరువాత కంగనా మహేశ్ భట్ తో పనిచేయనుందని చెప్పింది. అందుకు కోపగించిన భట్ ఆమె ప్రీమియర్ షోకి వస్తే చెప్పు విసిరేసి దుర్భాషలాడాడని పేర్కొంది. స్పెషల్ షో చూడనీయకుండానే కంగనాని మహేశ్ భట్ తిప్పి పంపాడట. అప్పట్నుంచీ కంగనాకి, భట్ ఫ్యామిలీకి పర్మనెంట్ గా శత్రుత్వం ఏర్పడిపోయింది
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…