అవిసె గింజలను సాధారణంగా లావు దగ్గడానికి ఎక్కువగా వాడుతారు. గ్రామాలలో బరువు, కీళ్ళ నొప్పులు, దగ్గు, జలుబు నయం చేయడానికి మరియు పచ్చళ్ళు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. మన పూర్వీకులు ఈ అవిసెగింజలతో ఎన్నో వైద్యాలు చేసేవారు. పూర్వ కాలం నుంచి వస్తున్న ఓ చిట్కాలను కూడా మన బామ్మలు, అమ్మమ్మలు చేస్తుంటారు. అయితే వీటి ద్వారా కూడా నూనెను తయారు చేయొచ్చు. ఆలివ్ ఆయిల్, లావెండర్ ఆయిల్, జొజోబా ఆయిల్, మొదలైన ఆయిల్స్‌ని మనం చూశాం.
కానీ వీటితో తయారయ్యే నూనె ఎలా ఉంటుంది.. దాని ఉపయోగాలేంటి అనేవి తెలుసుకుందాం. అవిసె గింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన చర్మం, జుట్టుతో పాటూ ఇతర శరీర భాగాలకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ప్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్ పై అవిసె గింజలు చల్లుకుని తింటే ఆరోగ్యం బావుంటుంది.
వీటితో తయారు చేసిన నూనెను.. చర్మంపై ఏర్పడిన దద్దుర్లు, దురదను తగ్గిస్తుంది. దీర్ఘ కాలిక చర్మవ్యాధులకు ఈ నూనె చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ఈ నూనెతో చర్మం తేమగా ఉంటుంది. అవిసెగింజల నూనె అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ ను గణనీయంగా తగ్గుతాయి. వీటిని తినడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. అవిసె గింజల పొడిని పండ్ల రసంలో కలుపుకుని తాగితే అధిక బరువు తగ్గుతారు.
అలాగే అవిసె గింజల్లోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్య మరియు సౌందర్యానికి బాగా దోహదం చేస్తాయి. అవి చర్మాన్ని తేమగా మరియు మృదువుగా చేస్తాయి. కాలుష్య కారకాలు మీ చర్మ రంధ్రాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. చర్మంలోని తేమను అవి కాపాడతాయి. తద్వారా చర్మం పై ముడతలుపోతాయి. అవిసెగింజల నూనె మీ జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…