Tag Archives: customers

Bank Accounts: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..! వాటిపై పెరిగిన వడ్డీ రేట్లు..!

Bank Accounts: ఇటీవల ఇండియాలో బ్యాంకింగ్ సేవలు బాగా విస్తరించాయి. సులభతరంగా లోన్లు కూడా ఇస్తున్నారు. దీంతో పాటు ఇన్స్ స్టంట్ లోన్లను అందిస్తున్నారు. ఉద్యోగులు సొంతిళ్లు, కారు, బైక్ ఇంకేదైనా.. కొనుక్కొవాలంటే వెంటనే లోన్లను ప్రొవైడ్ చేస్తున్నారు.

Bank Accounts: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..! వాటిపై పెరిగిన వడ్డీ రేట్లు..!

ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు తన ఖాతాదారులకు అనేెక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇటు బిజినెస్ చేయడానికి కూడా బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి.  భారతదేశంలో టాప్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు. 

Bank Accounts: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..! వాటిపై పెరిగిన వడ్డీ రేట్లు..!

తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు హెడ్ డీ ఎఫ్ సీ కూడా తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 2, 2022 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు తన వైబ్ సైట్ లో పేర్కొంది. 

ఈ సేవింగ్స్ ఖాతాలకు వర్తిస్తాయని..

నోటిఫికేషన్ ప్రకారం బ్యాంకులో డిపాజిట్ మొత్తాల ఆధారంగా వడ్డీ రేట్లను ప్రకటించింది. రూ. 50 లక్షల కన్నా తక్కువ ఉన్న నిల్వ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై సంవత్సరానికి 3 శాతం వడ్డీ రేట్లను ఇస్తోంది. రూ. 50 లక్షలకు పైగా రూ. 1000 కోట్ల కన్నాా తక్కువగా ఉన్న నగదు డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీని ఏడాదికి ఇవ్వనుంది. దీంతో పాటు రూ. 1000 కోట్ల కన్నా ఎక్కువ పొదుపు నిల్వలపై ఏడాదికి 4.50 శాతం వడ్డీరేటును అందిస్తోంది. ప్రస్తుతం సవరించిన రేట్లు దేశీయ, ఎన్ ఆర్ ఓ, ఎన్ ఆర్ ఈ సేవింగ్స్ ఖాతాలకు వర్తిస్తాయని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.

డెలివరీ బాయ్ కు కస్టమర్ ఎంత టిప్పు ఇచ్చాడో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్..!

ప్రస్తుతం కరోనా సమయంలో ఫుడ్ డెలవరీలు బాగా పెరిగిపోయాయి. భయటకు వెళ్తే ఎక్కడ కరోనా మహమ్మారి తమకు అంటుకుంటుందో అనే భయంతో ఇంట్లోనే ఉంటుంన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం వరకు ఫుడ్ డెలివరీ యాప్ లు మితంగా ఉండేవి. కరోనా లాక్ డౌన్ దగ్గర నుంచి డెలివరీ యాప్ లు.. డెలివరీ చేసే బాయ్ లు కూడా ఎక్కువ అయ్యారు. అయితే యాప్ లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చే సమయంలో డబ్బులు పే చేసి ఆర్డర్ ఇస్తాం.

ఈ విధంగా డెలివరీ బాయ్ దానిని తీసుకొచ్చి మనకి ఇస్తాడు. మనకు ఇష్టం ఉంటే టిప్ ఇస్తాం లేదంటే లేదు. ఇక్కడ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. అమెరికాలో ఓ వ్యక్తి పిజ్జాహట్‌లో పిజ్జా ఆర్డర్‌ పెట్టాడు. తీసుకుని వచ్చి కస్టమర్‌ ఇంటి తలుపు తట్టాడు. పిజ్జాను అతడికి డెలివరీ చేస్తూ .. తనకు టిప్ ఇవ్వాలని కోరాడు.

డెలివరీ బాయ్ ఇలా టిప్పు అడగడంతో అతడు తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. అంతగా కావాలంటే పిజ్జాలోని ఓ ముక్క తీసుకోండంటూ చెప్పాడు. ఏంటి సార్.. జోక్ చేస్తున్నారా అంటూ డెలివరీ బాయ్ అతడిని అడిగాడు. దీంతో ఆ కస్టమర్ ఇలా అన్నాడు.. లేదు లేదు నిజంగంటే డబ్బులు లేవు అని చెప్పడంతో డెలివరీ బాయ్‌ తెచ్చిన పిజ్జాలో ఓ ముక్క తీసుకుని తింటూ వెళ్లిపోయాడు.

ఈ దృశ్యాలను ఆ కస్టమర్‌ టిక్‌టాక్‌లో వీడియో అప్‌లోడ్‌ చేశాడు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన విషయాలన్నీ ఆ వీడియోలో టెక్ట్స్‌ రూపంలో వివరించాడు. రింగ్‌డోర్‌బెల్‌ కంపిలేషన్‌ అనే టిక్‌టాక్‌ అకౌంట్‌లో ఈ వీడియో ఉంది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచి గొప్ప టిప్పు ఇచ్చావంటూ కామెట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. సులభంగా కొత్త ఇల్లు..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వినియోగదారులకు గత కొన్నిరోజులుగా వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజల ఆదాయం భారీగా తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గిస్తూ ఎస్బీఐ బ్రహ్మాండమైన ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఎస్బీఐ కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునేవారికి బ్రహ్మాండమైన ఆఫర్లను ప్రకటించింది.

గృహ రుణాల వడ్డీ రేటుపై ఏకంగా 25 బేసిక్ పాయింట్ల రాయితీని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఎవరైతే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారో వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. అయితే ఎస్బీఐ రుణం తీసుకున్న వారి సిబిల్ స్కోరును సైతం పరిశీలిస్తోంది. అయితే 75 లక్షల రూపాయలకు పైగా హోం లోన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ బేస్ రేటు వర్తింపు జరుగుతుంది.

గతంలో మధ్య తరగతి వర్గాల ప్రజలకు సైతం ప్రయోజనం చేకూరేలా పది నుంచి 20 బేసిక్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ ప్రకటించిన ప్రధాన నగరాలతో పాటు మెట్రో నగరాల్లో ఈ రాయితీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించింది. ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వినియోగదారులు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 లక్షల రూపాయలకు పైగా 7 శాతం వడ్డీని.. 30 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే 6.9 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ వినియోగదారులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుండటం గమనార్హం.