Tag Archives: dalita bandhu scheme

దళితబంధుకు బ్రేక్.. ఈసీ కీలక ఆదేశాలు..

హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళితబంధు. దీనిని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం చేసేందుకు ప్రవేశపెట్టినదే దళితబంధు పథకం.

ఇప్పటికే ఈ పథకం కిందా చాలామందికి డబ్బులు కూడా క్రిడిట్ అయ్యాయి. అయితే ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని.. దళితులపై ప్రేమ ఉంటే.. రాష్ట్రం మొత్తం అమలు చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ రోజు ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్రం అంతటా దీనిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామాని సీఎం చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు దిక్కుల ఉన్న నాలుగు మండలాల్లో కూడా దీనిని అమలు చేస్తున్నారు. అందులో ఒకటి ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం కూడా ఉంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హుజురాబాద్‌లో దళిత బంధు పథకానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో దళిత బంధు అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. అయితే ఉప ఎన్నిక తర్వాత ఈ పథకం యాథావిధిగా అమలు అవుతుందని స్పష్టం చేసింది.