హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళితబంధు. దీనిని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం చేసేందుకు ప్రవేశపెట్టినదే దళితబంధు పథకం.
ఇప్పటికే ఈ పథకం కిందా చాలామందికి డబ్బులు కూడా క్రిడిట్ అయ్యాయి. అయితే ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని.. దళితులపై ప్రేమ ఉంటే.. రాష్ట్రం మొత్తం అమలు చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ రోజు ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్రం అంతటా దీనిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామాని సీఎం చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు దిక్కుల ఉన్న నాలుగు మండలాల్లో కూడా దీనిని అమలు చేస్తున్నారు. అందులో ఒకటి ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం కూడా ఉంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హుజురాబాద్‌లో దళిత బంధు పథకానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో దళిత బంధు అమలును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. అయితే ఉప ఎన్నిక తర్వాత ఈ పథకం యాథావిధిగా అమలు అవుతుందని స్పష్టం చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…