Tag Archives: dana veera sura karna

Vijayendra Prasad: వక్రీకరించడం అంటే దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ చేసింది.. ‘ఆర్ఆర్ఆర్’ అలా కాదు : విజయేంద్ర ప్రసాద్

Vijayendra prasad: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రాజమౌళి ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల జీవితాలను ఈ చిత్రం ద్వారా వక్రీకరిస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

Vijayendra prasad: వక్రీకరించడం దానవీర శూరకర్ణ .. ఆర్ఆర్ఆర్ కాదు: విజయేద్రప్రసాద్

ఈ క్రమంలోనే ఈ విమర్శలపై రాజమౌళి తండ్రి సినీ రచయిత విజయేంద్రప్రసాద్ స్పందించారు. ఈ సినిమాలో స్వాతంత్ర సమరయోధులు అయిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను తాము వక్రీకరించడం లేదని ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

Vijayendra prasad: వక్రీకరించడం దానవీర శూరకర్ణ .. ఆర్ఆర్ఆర్ కాదు: విజయేద్రప్రసాద్

మేము కేవలం వారి పాత్రలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సరికొత్త కథను తయారు చేసాము అంతేకాకుండా ఈ సినిమాలో వారికి ఎలాంటి గౌరవ భంగం కలగకుండా చిత్రీకరించామని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో సందర్భంగా యాంకర్ దాన వీర శూర కర్ణ ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు.

మహాభారతంలో ఎక్కడా లేదు…

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దానవీరశూరకర్ణ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని చెబుతున్నాను. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు జన్మ వృత్తాంతం గురించి చెబుతారు.నువ్వు ద్రౌపది పై మోజు పడ్డావు కదా ఆమెను ఆరో భర్తగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ సన్నివేశం ఆ సినిమాలో ఉంది కానీ మహాభారతంలో ఎక్కడా లేదని వక్రీకరించడం అంటే ఇదని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ దాన వీర శూర కర్ణ సినిమా గురించి ప్రస్తావించారు.