Tag Archives: death anniversary

ఎస్పీ బాలును స్మరించుకుంటున్న నెటిజన్స్.. వైరల్ అవుతున్న పాటలు..

స్వాతంత్రం రాక ముందు అంటే 1945 జూన్ 4 న జన్మించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం సెప్టెంబర్ 25, 2020 లో మాయదారి కరోనా మహమ్మారి దాటికి కన్నుమూశారు. సరిగ్గా నేటికి అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సంవత్సరం. మనిషికి మరణం ఉంటుంది కానీ.. అతడు పాడిన పాటలకు ఏనాడూ మరణం ఉండదు.. అంతే కాకుండా.. అతడి గానం కూడా ప్రతీ ఒక్కరి మదిలో నిండి ఉంటుందంటూ సోషల్ మీడియాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి స్మరించుకుంటున్నారు నెటిజన్లు.

ఉదయం నుంచి ట్విట్టర్‌లో #SPBalasubrahmanyam అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు అతడు పాడిన పాటలు కూడా హల్ చల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తొలిసారిగా 1966లో విడుదలైన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో పాడే అవకాశం వచ్చింది ఎస్పీ బాలసుబ్రమణ్యంకు.. ఎంతో మంది హీరోలకు తన స్వరంతో.. వారికి అనుగుణంగా పాటలు పాడారు. తెలుగు సినిమా పాటలకు ఘంటసాల అందించిన సేవలు.. అతడి పాడిన పాటలకు ఎంతో ఘన చరిత్ర ఉంది.

అతడి వారసుడిగా పునికి పుచ్చుకున్నాడు ఎస్పీ. అతడు దాదాపు నాలుగు దశాబ్దాల్లో…11భాషల్లో 40వేల పాటలు పాడి గిన్నీస్ రికార్డు నెలకొల్పారు. ఆయన అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కే లేదు. తన కెరీర్ మొత్తంలో, బాలసుబ్రహ్మణ్యం కేవలం నేపథ్య గానం మాత్రమే కాకుండా, సంగీత దర్శకత్వం, నటన, డబ్బింగ్ మరియు నిర్మాణానికి కూడా అవార్డులు గెలుచుకున్నారు. ఇంకా అతడు టెలివిజన్ అరంగేట్రం చేసిన తెలుగు మ్యూజిక్ రియాలిటీ టీవీ షో ‘పాడుతా తియ్యగా’కు హోస్ట్ మరియు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు .

1996 నుండి ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి ప్రతిభావంతులైన గాయకులను వెలికితీసిన ఘనత కూడా ఎస్పీదే. ఉష , కౌసల్య , గోపిక పూర్ణిమ , మల్లికార్జున్ , హేమచంద్ర , ఎన్‌సి కారుణ్య , స్మిత మొదలైన గాయకులు ఇక్కడ పాడి తన సత్తా చాటుకున్నావాళ్లే.