Tag Archives: december 1

నేటి నుంచి ఈ నిబంధనలు మారనున్నాయి.. అగ్గిపెట్టె ధరలతో సహా మరికొన్ని..

నేటి నుంచి ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన నిబంధనలు మారే అవకాశం ఉంది. అవేంటంటే.. పదవీ విరమణ పొందిన వారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను జీవన్ ప్రమాణ్ కేంద్రాలలో సమర్పించాలి. ఈ సమర్పణకు చివరి తేదీ నవంబర్ 30, 2021. ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలి. లేదంటే.. మీ పెన్షన్ రద్దు చేయబడుతుంది.

ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతా ఉన్నవాళ్లకు వడ్డీ రేటును తగ్గించింది. ఖాతాలో రూ.10 లక్షల కంటే తక్కువ డిపాజిట్ ఉన్నవాళ్లకు 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రూ.10 లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్లకు 5 బేసిస్ పాయింట్లకు తగ్గించింది.

ఈ నిబంధన నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడే వాళ్లకు షాకింగ్ అనే చెప్పాలి. నేటి నుంచి మొదలయ్యే ఈఎంఐ లావాదేవీలపై ప్రెసెసింగ్ ఫీజులను వసూలు చేయనుంది. SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు పన్నుతో పాటు రూ.99 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1, 2021లోపు ఏదైన ప్రొడక్ట్ పై ఈఎంఐ ఉంటే.. దానికి ఇది వర్తించదు.

ఇక అగ్గి పెట్టెల ధరలు ఈ రోజు నుంచి పెరగనున్నాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత అగ్గిపెట్టె ధరలు పెరగనున్నాయి. దీనిని రూ.1 నుంచి రూ.2 వరకు పెంచారు. అగ్గిపెట్టె ధరలు చివరిసారిగా 2007లో బాక్స్‌కు 50 పైసల నుండి రూ.1కి పెంచారు. ఇక ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ ధరల్లో మార్పులు వచ్చేవి. కానీ గత కొన్ని నెలల నుంచి మాత్రం 1 నుంచి 15 తేదీ మధ్యలో సవరిస్తూ వస్తున్నారు. కానీ ఈ సారి ఎల్పీజీ నిబంధనల్లో మార్పులు వస్తాయని తెలుపుతున్నారు.