Tag Archives: devotees

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..! వాటిపై రాయితీ ప్రకటన..!

Tirumala: దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల – తిరుపతి ఒకటి. దేశంలోని నలుమూలల నుంచి రోజూ వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటు ఉంటారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతి విరజిల్లుతోంది. ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగతోంది.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..! వాటిపై రాయితీ ప్రకటన..!

కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి తిరుపతి వెంకన్న దర్శనానికి అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. తాజాగా ఓమిక్రాన్, కరోనా భయాల వల్ల కూడా శ్రీవారి దర్శనాలకు బ్రేక్ పడింది. దీనికి తోడు గతేడాది చివరలో కురిసిన వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. 

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..! వాటిపై రాయితీ ప్రకటన..!

ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల దర్శనం టికెట్లను కూడా టీటీడీ ప్రారంభించింది. దీంతో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పరిస్థితులు ప్రస్తుతం చక్కబడటంతో రానున్న కాలంలో మరింత మంది ప్రజలు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉంది. 

72 గంటల పాటు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని..

అయితే ఈ నేపథ్యంలో భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ. దూరప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే వారి సౌకర్యార్థం ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. తిరుమల- తిరుపతి మధ్య రాకపోకలకు ఒకేసారి టికెట్ తీసుకుంటే… 10 శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తిరుమల-తిరుపతికి వచ్చిన తర్వాత 72 గంటల పాటు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ విధానం నేటి నుంచి అమలులోకి వస్తున్నట్లు వెల్లడించారు.

సోమవారం భస్మధారణ ఎందుకు చేస్తారో తెలుసా..?

ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైనది సోమవారం రోజు శివుని పూజించే భక్తులు అందరూ తప్పనిసరిగా విభూదిని ధరిస్తారు. విభూది అంటే శివుడికి ఎంతో ఇష్టమైనది అని చెప్పవచ్చు. శివుడికి ఇష్టమైన ఈ విభూదిని ధరించడం వల్ల వారికి అన్ని వేళలా ఆ పరమశివుడు తోడై ఉంటాడని పండితులు చెబుతున్నారు.భస్మధారణ చేయకుండా జపాలు, తపస్సులు చేయడంవల్ల ఎలాంటి ఫలితాలు కలగవని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మన శరీరంలో 32 చోట్ల భస్మధారణ చేయాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా సోమవారం భస్మధారణ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

శిరస్సు, రెండు చేతులు, గుండె, నాభి అనే ఐదు ప్రదేశాల్లో భస్మాన్ని ధరించడం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా మూడు గీతలు భస్మాన్ని ధరించడం వల్ల మన జీవితంలో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయని చెబుతారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఒక రోజు విహారానికి వెళుతూ తను ధరించడానికి నగలు, ఐశ్వర్యం కావాలని ఆ పరమశివుని అడగగా.. అందుకు శివుడు కొద్దిగా విభూతిని ఇచ్చి కుబేరుడి వద్దకు వెళ్లి విభూతిని ఇచ్చి తనకు కావలసింది తీసుకోమని తెలియజేస్తాడు.

శివుడు చెప్పిన విధంగానే పార్వతీదేవి ఆ విభూదిని తీసుకొని కుబేరుడు దగ్గరకు వెళ్లి ఆ విభూతికి సరిపడ నగలు ఇవ్వాల్సిందిగా కోరుతుంది.ఆ విధంగా విభూదిని త్రాసులో పెట్టి కుబేరుడు ఉన్న ఐశ్వర్యం అంతటిని త్రాసులో ఉంచినప్పటికీ కూడా త్రాసు లేవలేదు. దీనిని బట్టి శివుడు ఎంతో నిరాడంబరంగా ఉంటూ తన భక్తులకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. అందుకోసమే శివుని ఐశ్వర్య ప్రదాత అని కూడా పిలుస్తారు. అందువల్ల ఆ పరమశివుని పూజించే భక్తులు సోమవారం భస్మధారణ తప్పకుండా చేయాలని వేద పండితులు చెబుతున్నారు.