Tag Archives: doctor sudhakar

డాక్టర్ సుధాకర్ కేసులో ఐదుగురు అధికారుల పాత్ర.. మరణించిన సంవత్సరానికి అసలు గుట్టు?

కరోనా మొదటిదశలో భాగంగా విశాఖపట్నంకి చెందిన డాక్టర్ సుధాకర్ అప్పట్లో ఎంత హంగామా క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఆస్పత్రిలో ఒక మాస్క్, గ్లౌజులు ఇచ్చి వాటిని పదేపదే వాడుకో అని చెబుతున్నారు అంటూ పెద్ద ఎత్తున మీడియా ఎదుట ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యారు.

ఇలా డాక్టర్ సుధాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అప్పటి ప్రభుత్వం నిజానిజాలు గురించి ఎంక్వయిరీ చేసి ఆయనను విధుల నుంచి తొలగించడం జరిగింది.ఇలా విధుల నుంచి తొలగించిన తర్వాత ఆయనపై కేసు నమోదు చేయడంతో కొన్ని రోజుల పాటు మానసికంగా ఎంతో క్షోభ అనుభవించి డాక్టర్ సుధాకర్ ఆస్పత్రిలో చేర్పించారు.ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించగా ఈ కేసు విచారణలో భాగంగా కేసును సీబీఐకు అప్పగించాలని తెలియజేసింది.

ఈ క్రమంలోనే సుధాకర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించి గుండెపోటుతో మరణించారు. సుధాకర్ కేసులో సిబిఐ విచారణ చేపట్టగా సుధాకర్ వ్యవహారంలో ఐదుగురు అధికారుల పాత్ర కీలకంగా ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు అధికారులు వారి దర్యాప్తులో పేర్కొన్నారు.

ఇలా ఐదుగురు అధికారులు పేర్లను నమోదు చేసిన సీబీఐ వారిని ప్రాసిక్యూషన్ జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటామని సి.బి.ఐ హైకోర్టుకు తెలియజేయడంతో ఆ అయిదుగురు అధికారులను ప్రాసిక్యూషన్ చేరడానికి హైకోర్టు అనుమతి తెలిపింది.