Tag Archives: DOPPW India

పెన్షన్ ప్లాన్.. నెలకు రూ.1.25 లక్షలు రావాలంటే ఈ పని చెయ్యండి!

పెన్షన్ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పెన్షన్ కూడా ఇస్తుంది. దీని గురించి చాలామందికి తెలియదు. అయితే దీనికి 80 ఏళ్ల వయస్సు నిడిన వారు అర్హులుగా పేర్కొన్నారు. దీనిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఇండియా ప్రారంభించింది. దీనికి కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది. నెలకు రూ.9 వేలు మరియు గరిష్టంగా రూ.1.25 లక్షలు పొందొచ్చని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పొందే దానిలో 20-100 శాతం మధ్య అదనపు పెన్షన్ పెరుగుతుంది. కుటుంబ పెన్షన్ మొత్తం కూడా సేవకుడి చివరి చెల్లింపులో 30 శాతం ఉంటుంది. పెన్షనర్ 80 ఏళ్లు నిండిన వెంటనే ఈ పథకం అమలులోకి వస్తుంది.

దీనిలో ముఖ్యంగా 80 ఏళ్లు నిండిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాథమిక పెన్షన్‌లో అదనంగా 20 శాతం లభిస్తుంది. అదే కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల వయస్సు 85 దాటితో ప్రాథమిక పెన్షన్‌లో 30 శాతం లభిస్తుంది. 90 సంవత్సరాల వయస్సులో ప్రాథమిక పెన్షన్‌లో 40 శాతం, 95 సంవత్సరాల వయస్సులో ప్రాథమిక పెన్షన్‌లో 50 శాతం మరియు 100 సంవత్సరాల వయస్సులో 100 శాతం ప్రాథమిక పెన్షన్ అందుబాటులో ఉంది.

దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DOPPW India) ట్విట్టర్‌లో ట్వీట్ ద్వారా ఈ సేవను పొందడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. వృద్ధాప్య వయస్సులో వచ్చే అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇలా అదనపు పెన్షన్ ను కేంద్రం ప్రవేశపెట్టింది.