పెన్షన్ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పెన్షన్ కూడా ఇస్తుంది. దీని గురించి చాలామందికి తెలియదు. అయితే దీనికి 80 ఏళ్ల వయస్సు నిడిన వారు అర్హులుగా పేర్కొన్నారు. దీనిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఇండియా ప్రారంభించింది. దీనికి కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది. నెలకు రూ.9 వేలు మరియు గరిష్టంగా రూ.1.25 లక్షలు పొందొచ్చని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పొందే దానిలో 20-100 శాతం మధ్య అదనపు పెన్షన్ పెరుగుతుంది. కుటుంబ పెన్షన్ మొత్తం కూడా సేవకుడి చివరి చెల్లింపులో 30 శాతం ఉంటుంది. పెన్షనర్ 80 ఏళ్లు నిండిన వెంటనే ఈ పథకం అమలులోకి వస్తుంది.
దీనిలో ముఖ్యంగా 80 ఏళ్లు నిండిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాథమిక పెన్షన్‌లో అదనంగా 20 శాతం లభిస్తుంది. అదే కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల వయస్సు 85 దాటితో ప్రాథమిక పెన్షన్‌లో 30 శాతం లభిస్తుంది. 90 సంవత్సరాల వయస్సులో ప్రాథమిక పెన్షన్‌లో 40 శాతం, 95 సంవత్సరాల వయస్సులో ప్రాథమిక పెన్షన్‌లో 50 శాతం మరియు 100 సంవత్సరాల వయస్సులో 100 శాతం ప్రాథమిక పెన్షన్ అందుబాటులో ఉంది.
దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DOPPW India) ట్విట్టర్‌లో ట్వీట్ ద్వారా ఈ సేవను పొందడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. వృద్ధాప్య వయస్సులో వచ్చే అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇలా అదనపు పెన్షన్ ను కేంద్రం ప్రవేశపెట్టింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…