Tag Archives: educational institutions

Medico Preethi: గాంధీ ఆసుపత్రికి ప్రీతి మృతదేహం… ఆందోళనకు దిగిన విద్యార్థులు!

Medico Preethi: మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. సీనియర్ విద్యార్థి వేధింపులను తాళలేక ప్రమాదకరమైన ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ప్రీతి గత ఐదు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.

అయితే ఈమె మరణం విషయంలో పెద్ద ఎత్తున హై డ్రామాలు నడిచాయని, కుట్రలు జరిగాయని, పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్నటువంటి ప్రీతి సీనియర్ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఐదు రోజుల పాటు మృత్యులతో పోరాడిన ఈమె మరణించిందని తెలియగానే ఒక్కసారిగా నిమ్స్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఒకవైపు ప్రీతి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గిరిజన సంఘాల నేతలు బిజెపి నాయకులు ఆసుపత్రి వాతావరణం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే ప్రీతి మరణ వార్తను ప్రకటించడానికి ముందే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ప్రీతి మరణం పై కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

Medico Preethi: విద్యాసంస్థలకు బంద్…

ఇక ప్రీతి మరణించడంతో విద్యార్థుల సైతం ఆందోళనకు దిగి నిందితులకు తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా నేడు విద్యాసంస్థలకు కూడా బంద్ ప్రకటించారు. ఇక ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.