Tag Archives: ex- wife

Noel Ex Wife: అది భరించలేకనే.. పెళ్ళైన ఆరు నెలలకే విడాకులకు తీసుకున్నా..! : ఎస్తర్

Noel Ex Wife: టాలీవుడ్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోయల్ గురించి అందరికీ తెలిసిందే ఈయన సింగర్, నటి ఎస్టర్ వాలెరీ నోరోన్హాను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె పలు కన్నడ సినిమాలలోను నటించారు అదేవిధంగా తెలుగులో భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు వంటి సినిమాలలో నటించి సందడి చేశారు.

Noel Wife: భరించలేకనే ఆరు నెల్లకే విడాకులకు అప్లై చేశా.. నోయల్ మాజీ భార్య?

ఇక ఆది సాయి కుమార్ నటించిన గరం సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లో నటించి సందడి చేసిన ఈమె సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వీరి పెళ్లి జరిగిన ఆరు నెలలకే వీరు విడాకులు తీసుకొని అందరినీ షాక్ కి గురి చేశారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చించారు.

Noel Wife: భరించలేకనే ఆరు నెల్లకే విడాకులకు అప్లై చేశా.. నోయల్ మాజీ భార్య?

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్టర్ వాలెరీ నోరోన్హా తన విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను వెల్లడించారు.నా జీవితంలో పెళ్లి చేసుకోవాలి అనుకోవడమే ఒక పెద్ద డెసిషన్ అని అయితే ఇలాంటి పెద్ద డెసిషన్ తీసుకున్న తర్వాత నా జీవితం ఇంత తొందరగా విడాకులతో ముగిసిపోతుందనీ ఎప్పుడు అనుకోలేదు అని తెలియజేశారు.

అబద్ధాలు చెప్పడం నచ్చలేదు…

అయితే పెళ్లి అయిన ఆరు నెలలకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనదేనా ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దగ్గర చెప్పడం కరెక్టా కాదా అని ఎన్నోసార్లు ఆలోచించానని ఇక చివరికి తాను తీసుకున్న నిర్ణయం మంచిదని భావించి విడాకులు తీసుకున్నానని తెలిపారు.ఇక నోయల్ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఎన్నో కారణాలు ఉన్నాయని ముఖ్యంగా నేను ఒకే ప్రశ్నను ఎన్ని సార్లు అడిగిన తన దగ్గర నుంచి ఎన్నో రకాల సమాధానాలు వస్తాయని,చివరికి నేనే తప్పుగా మాట్లాడుతున్న అనే సందేహం తనలో వస్తుందని అందుకే ఆయన అలా అబద్ధాలు చెప్పడమే విడాకులకు కారణమైందని ఈ సందర్భంగా వెల్లడించారు.ఏది ఏమైనా పెళ్లి అయిన ఆరు నెలలకే ఇలా విడాకులతో విడిపోవడం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసిందని చెప్పవచ్చు.