Tag Archives: exam results

గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలు ఎప్పుడంటే..?

ఏపీలో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నెల రోజుల క్రితం పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 16,208 ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వెలువడగా పరీక్షలు జరిగాయి. పది లక్షలకు పైగా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయగా 7 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరున పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

అధికారులు ఇప్పటికే ఆన్సర్ షీట్ల స్కానింగ్ అభ్యర్థుల వారీగా మార్కుల ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఔస్ట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలలో 15 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మొదట ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్నట్టు కొందరు పేర్కొనకపోవడంతో వాళ్ల వివరాలను సేకరించడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.

మరోవైపు ఈసారి గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలకు ఫలితాలతో పాటు ర్యాంకులను కూడా ప్రకటించనున్నారు. మొత్తం 14 రకాల రాత పరీక్షలు జరగగా ప్రతి ఒక్కరికీ ర్యాంకులను ప్రకటించునున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లతో కూడిన ర్యాంకులను అధికారులు ప్రకటించనున్నారు. గత నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు గ్రామ, వార్డ్ సచివాలయాల రాత పరీక్షలు జరిగాయి.

19 కేటగిరీలలోని ఉద్యోగాల కోసం ఏడు రోజుల పాటు పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు ఉండగా ఆ ఉద్యోగాలలో 1,10,520 పోస్టులు ఇప్పటికే భర్తీ కాగా 16,208 ఉద్యోగాలను ప్రభుత్వం భరీ చేయనుంది.